- చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఎదుగుదలకు తగిన విధానాలు అవసరం
- రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలి
- ఉపాధి హామీ నిధుల వినియోగంలో సౌలభ్యం అవసరం
- కేంద్ర ఆర్థికమంత్రి – బద్దెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇన్ కామ్ ట్యాక్స్ వ్యవస్థ క్లిష్టంగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజయ్య రాజయ్య జై జై సల్మీర్ లో ఆర్థిక కేంద్ర శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రీ – బడ్జెట్ సమావేశంలో మన రాష్ట్రం తరపున భట్టి క్రమార్క పాల్గొని ప్రసంగించారు. అయితే 2026 ఆర్థిక సంవత్సరానికి చేరుకుంటున్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణను వృద్ధి అవసరాలతో సరిదిద్దడం కీలకమని అన్నారు. మూలధన వ్యయం, ఉపాధి సృష్టి పెంపు కోసం జీడీపీకి 4.5% ఆర్థిక లోటు గడువు అనుకూలమని తెలంగాణ అభిప్రాయంతో అన్నారు. ఆర్థిక సంవత్సరం 2027 నుండి, వృద్ధి ప్రేరేపిత విధానంతో ఋణ-తులనాత్మకతను తగ్గించడంపై తెలంగాణ దృష్టి పెట్టడం అసరమన్నారు.
ఆదాయ పన్ను చట్టం సంస్కరణలు స్వాగతయోగ్యమైనవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పన్ను వ్యవస్థ క్లిష్టంగా ఉండటం వల్ల వ్యక్తులు, వ్యాపారాలకు అనేక ఎదురవుతున్నాయని, పన్ను స్లాబులీకరణ, పన్ను రేట్ల తగ్గింపు అవసరమని ఆయన చెప్పారు. ఆదాయపు పన్ను, జీఎస్టీ ఫై ప్రక్రియలను సరళీకరించడం చాలా ముఖ్యమని తెలంగాణ అభిప్రాయపడుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. దేశీయ ఆర్థిక మందగమనంలో , మూలధన వ్యయ ప్రోత్సాహం అవసరమన్నారు. రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రత్యేక సహాయంగా సంవత్సరాలకు 2.5 లక్షల కోట్లు కేటాయించబడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ప్రధాన బలమని భట్టి విక్రమార్క చెప్పారు. అయితే వాటి ఎదుగుదల కోసం తగిన విధానాలు అవసరమన్నారు. టెక్నాలజీ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నామని ఆయన చెప్పారు. ఉపాధి , నైపుణ్యాల లోటు పరిష్కారం కోసం ఐటీఐలను ఆధునీకరించాలని, ఏఐ పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో యువతకు నైపుణ్యం కల్పించేందుకు తగిన నిధులు కావాలని భట్టి విక్రమార్క నిర్ధేశించారు. గిగ్ కార్మికులకు భద్రత, పర్యావరణం అందించడానికి జాతీయ రూపకల్పన సరైనదని ఆయన పేర్కొన్నారు.
ఎస్ఎస్ కింద తెలంగాణకు నిధులు కేటాయించాలి
ఎస్ఎస్ఎస్ (కేంద్ర పయోజిత ఫథకాలు) కింద తెలంగాణకు తగిన నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పెండింగ్ బకాయిల చెల్లింపు సంవత్సరానికి రూ.45 కోట్లు ఇవ్వాలని మరో ఐదేళ్ళ పాటు పొడిగించాలని ఆయన నిర్ణయించారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు పర్యావరణ అనుకూలమైన మౌలిక సదుపాయాలకు తగిన నిధులు అందించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ఉపాధి సమస్యల పరిష్కారానికి నిధుల వినియోగంలో మరింత సౌలభ్యం అసరమన్నారు. ఎంఎస్ఈల కోసం పీఎల్ఐ అమలు అభివృద్ధి చేయాలన్నారు. రుణస్వేచ్ఛ, ఆర్థిక స్వయం ప్రతిపత్తి రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి రుణాల కోసం తగిన అనుమతులు అందించబడతాయి భట్టి విక్రమార్క వివరాలు.