Home సినిమా 100 అడుగుల ఎన్‌.టి.రామారావు విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్‌ అనుమతి! – Sneha News

100 అడుగుల ఎన్‌.టి.రామారావు విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్‌ అనుమతి! – Sneha News

by Sneha News
0 comments
100 అడుగుల ఎన్‌.టి.రామారావు విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్‌ అనుమతి!


నటరత్న నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ సభ్యులు మధుసూదనరాజు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించి హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వివరించారు. దానితోపాటు ఎన్టీఆర్‌ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేసాము, దాన్ని ఓ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శన ఇవ్వడానికి సహకరించాలని కోరగా హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు మరియు ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారని తెలియజేశారు.

ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్ అభిమానులందరూ సంతోషిస్తున్నారు. ఆయనకు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ధన్యవాదాలు ధన్యవాదాలను తెలియచేస్తున్నాము అన్నారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech