పాత్రలు, గాత్రధారులు: మహేష్‌బాబు(ముఫాసా), బ్రహ్మానందం(పుంబా), అలీ(టిమోన్), సత్యదేవ్(టాకా), అయ్యప్ప పి.శర్మ(కైరోస్)
సంగీతం: డేవ్‌మెట్జర్
సినిమాటోగ్రఫీ: జేమ్స్ ల్యాక్స్టన్
ఎడిటింగ్: జాయ్ మెక్‌మిలన్
నిర్మాతలు: అడెలె రొమాన్‌స్కీ, మార్క్ సెర్యాక్
బ్యానర్: వాల్ట్ డిస్నీ పిక్చర్స్
దర్శకత్వం: బ్యారీ జెన్‌కిన్స్
విడుదల తేదీ: 20.12.2024
సినిమా నిడివి: 118 నిమిషాలు
హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ పిల్లల సంస్థ నుంచి సినిమా వస్తోందంటే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సంస్థ నిర్మించిన సినిమాల్లో లయన్ కింగ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ‘ది లయన్ కింగ్’ ప్రస్థానం 1994లో కనిపించింది. అయితే అప్పుడు 2డి యానిమేషన్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. 45 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే 980 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. పాతిక సంవత్సరాల తర్వాత దాన్ని 3డి యానిమేషన్‌లో నిర్మించి అదే పేరుతో విడుదల చేశారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం బాగా అందుబాటులోకి రావడంతో నిజంగానే జంతువులతో సినిమా తీశారా అన్నంత సహజంగా ‘ది లయన్ కింగ్’ రూపొందించారు. 2019లో విడుదలైన ఈ 250 మిలియన్ డాలర్ల రికార్డుతో నిర్మించబడింది, 1650 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. ఒక డబ్బింగ్ సినిమాలా కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా చూస్తున్నామా అనేంతగా డబ్బింగ్ ఆర్టిస్టులు తమ వాయిస్‌ని అందించారు. ఇప్పుడు ది లయన్ కింగ్‌కి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా.. ది లయన్ కింగ్’ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ ప్రధాన పాత్ర ముఫాసాకి సూపర్‌స్టార్ మహేష్ వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఈ సత్యదేవ్, అయ్యప్ప పి.శర్మ, బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్ శేషు సినిమా తమ గాత్రాన్ని అందించారు. సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా రూపొందించబడిన ఈ సినిమా ఎలా ఉంది, ది లయన్ కింగ్ స్థాయిలో ‘ముఫాసా’ ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాలను సమీక్షించి తెలుసుకుందాం.
కథ:
ముఫాసా ఎంతో బలమైనవాడు. ఎంతో చురుగ్గా కూడా ఉంటాడు. చిన్నతనంలోనే వరదల వల్ల తల్లిదండ్రులకు దూరమవుతాడు. మరో రాజ్యంలో అనాథగా పెరుగుతాడు. ఆ రాజ్యానికి రాజైన ఒబాసికి ముఫాసా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే అతని భార్య, కొడుకు ముఫాసాను ఆదరిస్తారు. ముఫాసా పెద్దవాడైన తర్వాత కూడా అతని మీద ఒబాసీకి అయిష్టత అలాగే ఉంటుంది. ఆ సమయంలో కొన్ని తెల్ల సింహాలు ఒబాసి భార్య మీద దాడి చేశారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో తెల్ల సింహాల రాజు కొడుకును ముఫాసా హతమారుస్తాడు. దీంతో ఆ రాజు ముఫాసాపై కక్షగట్టి అతనికి సంబంధించిన వారందర్నీ చంపేందుకు సిద్ధమవుతాడు. మరి తెల్ల సింహాలతో ముఫాసా పోరాటం ఎలా సాగింది, ఆ యుద్ధంలో వారిని గెలిచాడా? చివరికి తన తల్లిదండ్రుల్ని కలుసుకున్నాడా? ఈ వంటి జరిగిన పరిణామాలు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఒకప్పుడు యానిమేషన్‌లో జంతువులు మాట్లాడుతుంటే బాగానే అనిపించినా అంత జీవం వున్నట్టు కనిపించేది కాదు. కానీ, 3డి యానిమేషన్ వచ్చిన తర్వాత డైలాగుల ఉచ్ఛరణకు తగ్గట్టుగానే ఆ జంతువుల ముఖ కవళికలు, హావ భావాలు కనిపించడం ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తోంది. తెరపై జంతువులు మనుషుల్లాగే మాట్లాడడం, మనలా హావభావాలు పలికించడం కోసం చూసేందుకు ఎంతో బాగుంటుంది. మనకు సినిమాల ద్వారా ఉన్న నటినటులు ఆ జంతువులకు గాత్రదానం చేస్తే పరిచయం మరింత వన్నె వస్తుంది. ది లయన్ కింగ్‌లోగానీ, ముఫాసాలోగానీ అదే జరిగింది. ది లయన్ కింగ్‌లో జగపతిబాబు, నాని, బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్ శేషు, రవిశంకర్ వంటి వారు తమ గాత్రదానంతో ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్‌ను అందించగలిగారు. ఇప్పుడు ముఫాసా ప్రధాన పాత్ర కోసం మహేష్‌బాబు వాయిస్ ఇవ్వబోతున్నాడనే వార్త వచ్చిన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మహేష్ కోసం సినిమాకి వెళ్లిన ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని పొందుతారు. ముఫాసా క్యారెక్టర్‌కు మహేష్ ఎంతో శ్రద్ధగా డబ్బింగ్ చెప్పారు. కథ, ముఫాసా పాత్ర తత్వం, భావోద్వేగాలను తీసుకొని మహేష్ చెప్పిన డైలాగులు బాగా పండాయి. ఇక విజువల్‌గా ముఫాసా ప్రేక్షకులకు ఓ మధురానుభూతిని పంచుతుంది అనడంలో సందేహం లేదు. యానిమేటెడ్ సినిమా అనే ఫీల్ రాకుండా నిజంగా జంతువులే మాట్లాడుతున్నాయా అనే భావన ప్రేక్షకులకు కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఇంతవరకు మనకు బాగానే అనిపిస్తుంది. కానీ, ది లయన్ కింగ్ తరహాలో ఓ విభిన్నమైన కథను ఆశించే ప్రేక్షకులకు నిరాశ కలుగుతుంది. ఎంతో రొటీన్‌గా కథ సాగుతుంది. కథ పరంగా ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయలేకపోయింది. పార్ట్ పార్ట్‌గా సినిమా బాగున్నా.. టోటల్ కథ మాత్రం ఎక్సైట్ చేసింది. ది లయన్ కింగ్‌లో పాటలు ఎంతో ఆకట్టుకుంటాయి. సందర్భోచితంగా కూడా ఉంటాయి. కానీ, ఈ సినిమాలోని పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ముఫాసా పాత్ర అంత స్ట్రాంగ్‌గా లేకపోయినా మహేష్ వాయిస్‌తో దాన్ని కవర్ చేసారు. ఎప్పటిలాగే బ్రహ్మానందం, అలీ, షేకింగ్ శేషు తమ డైలాగులతో నవ్వించారు. విలన్ పాత్రకు అయ్యప్ప పి.శర్మ డబ్బింగ్ బాగా చెప్పారు.
ఫైనల్‌గా చెప్పాలంటే..
టెక్నికల్ వేల్యూస్‌కి అసలు లోటు లేదు. ఎక్కడిక్కడ విజువల్‌గా ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. అయితే కథ, కథనాల్లో పట్టు లేకపోవడం వల్ల సినిమా తేలిపోయింది. కథను పక్కన పెట్టేస్తే జంతువులు, అవి మాట్లాడే తీరు, విజువల్ ఎఫెక్ట్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి. ఇక మహేష్ వాయిస్ పెద్ద ప్లస్ పాయింట్ కాబట్టి సినిమాను ఒకసారి చూసేయచ్చు.
రేటింగ్: 2.25/5