హైదరాబాద్: బలగం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ప్రదర్శించిన బలం సినిమా క్లైమాక్స్‌లో మొగిలయ్య భావోద్వేగ భరత పాట పాడి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. కొన్ని రోజులుగా మొగిలయ్య కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధ పడుతున్నారు. మొగిలయ్య చికిత్స కోసం ప్రముఖ నటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థిక సాయం చేశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వరంగల్ లోని సంరక్ష ఆసుపత్రికి ఆయనను కలుసుకున్నారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు.