పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(ప్రభాస్)నటించిన ఎపిక్ సైన్స్ అండ్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి(కల్కి 2898 యాడ్)జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆరువందల కోట్ల భారీ బడ్జట్ తో రూపొందించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కుని కూడా అందుకుంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి నేషనల్ స్టార్స్ కూడా నటించారు.
ఇక ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరి 3న జపాన్‌లో జపాన్ లాంగ్వేజ్ లోనే విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ప్రభాస్ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది.అందులో ఆయన జపాన్ ప్రేక్షకులని ఉద్దేశించి మాట్లాడటం కల్కి జపాన్‌లో విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది.మూవీ మీ అందానికి బాగా నచ్చుతుంది.నేను ప్రమోషన్స్ కి వద్దామని అనుకున్నాను. కానీ చిన్న ఇంజురీ కావడం వలన రాలేకపోతున్నాను. ఈ సారి ఖచ్చితంగా వస్తానని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ప్రభాస్ కొంచంసేపు జపాన్ భాషలో కూడా మాట్లాడటం జరిగింది.