- పేరుకే 30 పడకల ఆసుపత్రి– సరైన వైద్యం అందక రోగుల ఇక్కట్లు
ముద్రణ.వీపనగండ్ల:-మండల కేంద్రమైన వీపనగండ్లలో 30 పడకల ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్న మధ్యాహ్నం తర్వాత రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులు అందుబాటులోకి రావడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుకకు పోయిందన్నట్లు ఆసుపత్రికి దాతలు అందించిన అంబులెన్స్ ను, 30 పడకల ఆసుపత్రికి 108 అంబులెన్స్ అందిస్తూ దాతలు అందించిన అంబులెన్స్ ను కూడా ఇతర ప్రాంతాలకు తరలించిన అధికారులు ప్రస్తుతం అంబులెన్స్ పోవడంతో అత్యవసర సమయాల్లో ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తూ పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబాయి మండలాల్లో సుమారు 35 గ్రామపంచాయతీలకు వీపనగండ్లలో నూతనంగా 30 అడుగుల ఆసుపత్రిని కలిగి ఉంది. దీనికితోడు ఇదే ఆసుపత్రి ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉంది.రెండు ఆసుపత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు తగినంత సిబ్బంది ఉన్న వైద్యులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విధులు నిర్వర్తించుకుని వెళ్తున్నారు, ఆ తర్వాత వచ్చే రోజులకు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎం వైద్య చికిత్స అందించడం ఆనవాయితీగా జరుగుతుంది. పని చేసే ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సమయాల్లో వైద్యులు లేకపోవడంతో రోగులకు మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఆసుపత్రిలో 24 గంటలు ఉండవలసిన వైద్యులు ఉండవలసిన అవసరం లేదు. రాత్రి వేళల్లో కాన్పుల కోసం వచ్చే మహిళలు, యాక్సిడెంట్ కేసులు, పాము కాటుకు గురైన వారు ఆసుపత్రికి రావడంతో స్టాఫ్ నర్సే వైద్య చికిత్సలు, సరియైన చికిత్స లేకుంటే వనపర్తి లేదా మహబూబ్‌నగర్ పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని ఉచిత సలహాలు ఇస్తూ చేతులు దులిపేసుకుంటున్నారని వాపోతున్నారు.
అత్యవసర సమయాలలో అవసరమయ్యే ఉద్దేశంతో దాతలు అందించిన అంబులెన్స్ ను కూడా జిల్లా వైద్యాధికారులు జిల్లా వైద్యని టీబీ ప్రోగ్రాంకు తీసుకెళ్లినట్లు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. నూతనంగా ఆసుపత్రికి 108 అంబులెన్స్ వచ్చిందని, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ అందుబాటులో ఉంచి మంత్రి చేతుల మీదుగా ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చిన 108 అంబులెన్స్ వాహనం వీపనగండ్లకు రాకుండానే ఇతర జిల్లాలకు తరలించినట్లు ఆసుపత్రి సిబ్బంది బహుబాటగా ప్రచారం చేశారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక కూడా పోయినట్లు కొత్త అంబులెన్స్ వస్తుందని పాత అంబులెన్స్‌లను తీసుకెళ్లడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు అధికారులు స్పందించి వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.