తమిళ హీరోలు సూర్య, కార్తీలకు తెలుగులో ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు పాతిక సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు సూర్య సినిమాలు చూస్తున్నారు. అయితే అవన్నీ తమిళ్లో నిర్మించినవే. ఇప్పటివరకు తెలుగువారు డబ్బింగ్ వెర్షన్స్ మాత్రమే చూశారు. ఆ విధంగా తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. అలాంటి సూర్య తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పటికే సూర్య సోదరుడు కార్తీ తెలుగులో డైరెక్ట్ సినిమా చేశాడు. ఇప్పుడు అదే బాటలో అన్నయ్య వెళ్లబోతున్నాడు. సూర్య కంటే చాలా లేట్‌గా తమ్ముడు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తెలుగులో స్పష్టంగా మాట్లాడడం నేర్చేసుకున్నాడు. కానీ, సూర్యకు మాత్రం అది సాధ్యం కాలేదు. తాజా సమాచారం ప్రకారం సూర్య హీరోగా తెలుగులో ఒక సినిమా నిర్మాణం శ్రీకారం చుట్టబోతోంది సితార ఎంటర్టైన్మెంట్స్.
భారీ సినిమా, చిన్న సినిమా అనేది చూడకుండా వైవిధ్యమైన సినిమాలను నిర్మించే సితార ఎంటర్టైన్స్ ఒక కొత్త ప్రాజెక్ట్‌తో రాబోతోంది. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘లక్కీ భాస్కర్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సూర్యతో వెంకీ చేయబోయే సినిమా ఏ తరహాలో ఉంటుందో, ఈసారి ఎవరిని టార్గెట్ చేశాడో తెలియాల్సి ఉంది. వెంకీ అట్లూరి వంటి టిపికల్ డైరెక్టర్‌తో సూర్యకు బాగా సెట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సూర్య ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు వెంకీ అట్లూరితో చేసే సినిమా కూడా అలాంటి ప్రయోగాత్మక చిత్రమూ అయి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలు ముందుగానే ఉన్నాయని.