డిసెంబర్ 5న విడుదలైన అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(పుష్ప 2)కేవలం ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక పుష్ప 2 ముఖ్యంగా హిందీ మార్కెట్ ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలో అక్కడ హీరోలకి కూడా సాధ్యం కాని రీతిలో కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.
తాజాగా నిన్న శుక్రవారం ఒక్క రోజే 25 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది.దీంతో హిందీకి సంబంధించి ఇప్పటి వరకు 461 కోట్ల షేర్ ని అందుకుంది.మరి ఈ లెక్కన వీకెండ్ పూర్తయ్యేసరికి 500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని హిందీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.దీంతో నార్త్ బెల్ట్ లో పుష్ప రాజ్ సరికొత్త సునామీని సృష్టించడం ఖాయమనే మాటలు వినపడుతున్నాయి.