8
అల్లు అర్జున్(allu arjun)కి నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా అల్లు అర్జున్ నిన్న చంచల్ గూడ జైలులోనే ఉండవలసి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆదేశాలు తర్వాత జరగాల్సిన ఇతర ప్రొసిడింగ్ కాకపోవడం వలనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ జైలు నుంచి విడుదలయ్యారు.
ఇక ఈ విషయం మీద అల్లు అర్జున్ తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్ట్ బెయిల్ ఉత్తర్వుల్లో వెంటనే విడుదల చేయాలి అని స్పష్టంగా ఉన్నా కూడా జైలు అధికారులు ఆ రూల్స్ ని కూడా పాటించకుండా అల్లు అర్జున్ ని అక్రమంగా నిర్బంధించారు.అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని అయన చెప్పడం జరిగింది.