ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, ఆయనకు చిన్న కుమారుడు మనోజ్ మధ్య కొద్దిరోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం రాజు కొని పోలీస్ స్టేషన్లకు చేరింది. మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి వద్ద పెద్ద గలాటానే జరిగింది. మనోజ్ ను ఇంటికి రానివ్వకుండా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం, మనోజ్ సెక్యూరిటీ సిబ్బంది ఇంటి తలుపులను పగలగొట్టి వెళ్లే ప్రయత్నం చేయడం, అదే సమయంలో పోలీసులు ఇరుపక్షాలను అదుపు చేసే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలోనే మీడియాపై దాడి జరగడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ వ్యవహారశైలిపై కీలకమైన ఆడియోను విడుదల చేశారు. కొడుకు ప్రవర్తన పట్ల ఆడియోలో తీవ్ర ఆవేదనను మోహన్ బాబు వ్యక్తం చేశారు. తాగుడుకు బానిసై అందరినీ కొడుతున్నావని. తన ఆస్తి తన ఇష్టమంటూ. మనోజ్ ను అల్లారు ముద్దుగా పెంచానని, చదువు కోసం చాలా ఖర్చు పెట్టానని ఈ సందర్భంగా మోహన్ బాబు గుర్తు చేశారు. భార్య మాటలు విని మనోజ్ నా గుండెలపై తన్నావు అని ఆడియోలో మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నానని, కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డారన్నారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్న అందరిని ఎందుకు కొడుతున్నావని మోహన్ బాబు ప్రశ్నించారు. బతుకుతెరువు కోసం వచ్చిన పని వాళ్ళను కొట్టడం మహా పాపం అన్నారు. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయని, అయినా కాపాడానన్నారు. విద్యాసంస్థల్లో లీగల్ గా ఉందని, తప్పులు ఎక్కడ జరగలేదని స్పష్టం చేశారు. అన్నతోపాటు వినయ్ ను కొట్టడానికి వచ్చావని, మీ అన్నను చంపుతానని బెదిరించావని మోహన్ బాబు. నా ఇంట్లో అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదని స్పష్టం చేశారు. ఈ ఆస్తి తన కష్టార్జితం అని మోహన్ బాబు తేల్చి చెప్పారు.
రోడ్డు కెక్కి తన పరువు తీసావని మోహన్ బాబు మనోజ్ పై అధ్వాన్నంగా ఉన్నాడు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయలా.? వద్దా.? అనేది తన ఇష్టమని మోహన్ బాబు స్పష్టం చేశారు. పిల్లలకు ఇస్తానా.? దానధర్మాలు చేస్తానా.? అన్నవి తన ఇష్టమని, మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదని. అయినా తాను సంపాదించుకున్నానని మోహన్ బాబు చెప్పారు. మనోజ్ తనను కొట్టలేదని, తామిద్దరం ఘర్షణ పడ్డామని స్పష్టం చేశారు. తన ఇంట్లోకి మనోజ్ అక్రమంగా చొరబడ్డావని, తన కొట్టావని మోహన్ బాబు మనుషులను. తనకు రక్షణ కావాలని పోలీసులను కోరినట్లు మోహన్ బాబు వివరించారు. మళ్లీ తప్పు చేయనని చెప్పి ఇంట్లోకి వచ్చావని, నీకు జన్మనివ్వడమేనా తాను చేసిన పాపం అని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మనోజ్ కుమార్తె ఇంట్లోనే ఉందని, కూతురును తీసుకెళ్లాలని చెప్పారు. తన దగ్గర వదిలిపెట్టిన ఇబ్బంది లేదని చెప్పారు. జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆసుపత్రిలో చేరిందని, పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డ నీకు అప్పగిస్తానన్నారు. తాజాగా మోహన్ బాబు విడుదల చేసిన ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మనోజ్ వద్దకు వెళ్ళిన సమయంలో ఆయనను ఉద్దేశించి మోహన్ బాబు ఈ ఆడియోను విడుదల చేశారు. తర్వాత మనోజ్ ఇంటికి రావడంతో పెద్ద గొడవ జరిగింది.
మీడియా ప్రతినిధులపై దాడి.. మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు
2024లో టాప్ బ్లాక్ బస్టర్స్ తెలుగు సినిమాలు