Home సినిమా తగ్గుదామంటున్న పుష్ప నిర్మాతలు.. తగ్గేదేలే అంటున్న హీరో..! – Sneha News

తగ్గుదామంటున్న పుష్ప నిర్మాతలు.. తగ్గేదేలే అంటున్న హీరో..! – Sneha News

by Sneha News
0 comments
తగ్గుదామంటున్న పుష్ప నిర్మాతలు.. తగ్గేదేలే అంటున్న హీరో..!


ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప-2’ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ ప్రభంజనం కనీసం నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ టైంలో తమ సినిమాలను విడుదల చేయడానికి ఇతర నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించారు. అలాంటిది పుష్ప నిర్మాతలే తాము నిర్మించిన మరో సినిమా ‘పుష్ప-2’ విడుదలైన మూడు వారాలకే విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం విషయంలో ఆలోచనలో పడ్డారు. (పుష్ప 2 రూల్)

‘భీష్మ’ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే మైత్రి సంస్థ నిర్మించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ డిసెంబర్ 5న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. నిజానికి ‘రాబిన్ హుడ్’ విడుదల తేదీని ప్రకటించినప్పుడే.. డిసెంబర్ 5న ‘పుష్ప-2’ విడుదల ఉంచుకొని తక్కువ రోజుల వ్యవధిలో విడుదల అవసరమా అని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే అప్పుడు నిర్మాతలు, 20 రోజుల గ్యాప్ ఉంది కదా.. సరిపోతుందని భావించారు. కానీ ప్రస్తుతం పుష్ప-2 బాక్సాఫీస్ ఊచకోత చూస్తుంటే, ఇప్పుడు ఆ ప్రభంజనం ఆగేలా కనిపించడం లేదు. అందుకే పుష్ప-2 దృష్టిలో పెట్టుకొని, ‘రాబిన్ హుడ్’ని వాయిదా వేయాలని నిర్మాతలు కోరుకుంటున్నారట. కానీ ఈ నిర్ణయం పట్ల హీరో నితిన్ మాత్రం సుముఖంగా లేడట. (రాబిన్‌హుడ్)

ఎంత పుష్ప-2 ప్రభావం.. అప్పటికి మూడు వారాలు అవుతుంది కాబట్టి, 50 శాతం థియేటర్లు అయినా ‘రాబిన్ హుడ్’కి కేటాయించే అవకాశం ఉందని నితిన్ కోరుకుంటున్నాడట. అలాగే ఈ క్రిస్మస్ సీజన్ మిస్ అయితే, మళ్ళీ ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ కూడా దొరకదని ఆయన ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి సీజన్ పై భారీ సినిమాలు కర్చీఫ్ వేశాయి. ఇక ఫిబ్రవరిలో నితిన్ నటిస్తున్న మరో సినిమా ‘తమ్ముడు’తో పాటు, పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లోనూ భారీ సినిమాలున్నాయి. ఈ లెక్కలన్నీ వేసుకొని, ఇప్పుడు విడుదల చేయడమే కరెక్ట్ అని నితిన్ బలంగా నమ్ముతున్నాడట. మరి ‘రాబిన్ హుడ్’ విడుదలపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech