అల్లు అర్జున్(allu arjun)వన్ మ్యాన్ షో పుష్ప 2(పుష్ప 2)వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.ఇప్పటికే రోజు కలెక్షన్స్ లో ఇండియన్ సినిమా హిస్టరీ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ ని సాధించిన ఫస్ట్ మూవీగా నిలిచిన పుష్ప మరొకరోజు వెయ్యి కోట్ల క్లబ్ లో కూడా చేరబోతుంది.
ఇక మరి ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో అయితే రోజురోజుకి కలెక్షన్స్ ల సునామిని సృష్టిస్తుంది. ఒప్పంద లేటెస్ట్ గా బిగ్ బి అమితాబచ్చన్(అమితాబ్ బచ్చన్)’ఎక్స్’ వేదికగా పుష్ప 2 గురించి ప్రస్తావిస్తు ‘మీ ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులమయ్యాం అంటూ ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారడమే కాకుండా నార్త్ లో పుష్ప 2 ప్రభంజనానికి నిదర్శనమని సినీ ట్రేడ్ వర్గాల వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఫస్ట్ వీకెండ్ పుష్ప 800 కోట్ల గ్రాస్ ని సాధించగా అందులో బాలీవుడ్ నుంచే 291 కోట్లు రావడం జరిగింది. హిందీలో షారుక్ ఖాన్ ‘జవాన్’ మూవీతో సహా అన్నిరికార్డులని బద్దలు కట్టిన పుష్ప ఒక్క హిందీలోనే ఏడువందల యాభై కోట్ల దాకా వసూలు చేస్తుందనే మాటలు కూడా బిజినెస్ వర్గాల్లో వ్యక్తం అవుతాయి. హిందీలో పుష్ప 2 జోరు థియేటర్ల దగ్గర ఎలా ఉందొ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీస్ రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో థియేటర్ దగ్గర జాతర ని తలపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకి 139 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.