భారత సినీ చరిత్రలో మొదటిరోజు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన తొలి చిత్రం ‘బాహుబలి-2’. ఈ సినిమా ఫస్ట్ డే రూ.210 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత రూ.220 కోట్లకు పైగా గ్రాస్ తో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ, ‘బాహుబలి-2’ రికార్డుని బ్రేక్ చేసింది. ఇక ఇప్పట్లో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ అవ్వడం కష్టం అనుకుంటుండగా, ‘పుష్ప-2’ సరికొత్త సంచలనం సృష్టించింది. తొలి రోజే ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి, ఎవరికీ అందనంత ఎత్తులో నిల్చుంది. ఇప్పట్లో ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీకి జూనియర్ ఛాన్స్ ఉంది. (పుష్ప 2 రూల్)
ఓపెనింగ్ డే రికార్డ్స్ క్రియేట్ చేసే టాలీవుడ్ స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. తెలుగునాట ఆయన పేరు మీద ఎన్నో ఫస్ట్ డే రికార్డులు ఉన్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ మార్కెట్ ఎంతో పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది ఆయన నటించిన ‘దేవర’ మొదటి రోజు రూ.150 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కూడా ఫస్ట్ డే నే రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టగల మార్కెట్ ఎన్టీఆర్ సొంతం. అలాంటి ఎన్టీఆర్ కి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తోడయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి ‘వార్-2’ సినిమా చేస్తున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో, నార్త్ లో హృతిక్ కి ఆ స్థాయి ఫాలోయింగ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా అంటే.. మొదటి రోజు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక దానికి స్పై యూనివర్స్ క్రేజ్ తోడు కావడంతో పాటు, ప్రచార చిత్రాలు కూడా కట్టుకొని అంచనాలు పెరిగితే మాత్రం.. ఫస్ట్ డే నే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదు. ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్ కి తగ్గట్టుగా, రిలీజ్ కి ముందు సరైన హైప్ వస్తే మాత్రం.. పుష్ప-2 ఓపెనింగ్ డే రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. (యుద్ధం 2)
ఒకవేళ వార్-2 మిస్ అయితే, ‘పుష్ప-2’ రికార్డుని బ్రేక్ చేసే ఛాన్స్ ‘స్పిరిట్’కి ఉంది. ఇది ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రానున్న సినిమా. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అసలే కంటెంట్ తో సంబంధం లేకుండా మొదటి రోజు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టగల స్టార్డం ప్రభాస్ సొంతం. మరోవైపు సందీప్ రెడ్డి ‘యానిమల్’తో సంచలనం సృష్టించాడు. అలాంటిది ఈ కాంబో మూవీ అంటే.. రికార్డు ఇద్దరి ఓపెనింగ్స్ వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (ఆత్మ)
ఒకవేళ ‘పుష్ప-2’ రికార్డుని ‘వార్-2’ కానీ, ‘స్పిరిట్’ కానీ బ్రేక్ చేసినా.. ఆ కొత్త రికార్డుని బద్దలు కొట్టే సత్తా ఒక సినిమాకి ఉంది. అదే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం. ఈ మూవీ ఎప్పుడొచ్చినా ఇండియన్ సినీ చరిత్రలో అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసి, సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.