ఏపీలో పెరుగుతున్న జనాభా సంఖ్యకు అనుగుణంగా జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా జూనియర్ కాలేజీలు అవసరం పై ఇంటర్ విద్యా మండల సర్వే రాష్ట్రవ్యాప్తంగా 37 మండలాల్లో 47 ఇంటర్ కాలేజీలు అవసరమని గుర్తించింది. ఎన్టీఆర్, గుంటూరు రెండు పట్టణాభివృద్ధి సంస్థల్లో మొత్తం ఆరు కాలేజీల అవసరం ఉంది. ఈ మేరకు కొత్త కాలేజీల అవసరం పై ఇంటర్ విద్యా మండలి చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. కొత్తగా 53 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇచ్చింది. కొద్దిరోజుల్లోనే కాలేజీలు ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3381 విద్యాసంస్థలు విద్యనందిస్తున్నాయి. అందులో 2000 పైగా ప్రైవేట్ కాలేజీలు, 470 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవి కాకుండా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, హై స్కూల్ ప్లస్‌లు, సాంఘిక సంక్షేమ, ఇతర సంక్షేమ సంస్థల పరిధిలోని కాలేజీలకు ఇంటర్ విద్యను అందజేస్తారు. భారీ సంఖ్యలో కాలేజీలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కాలేజీల అవసరం ఏర్పడుతుంది. పదో తరగతి పూర్తిచేసుకుని బయటకు వస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా కొత్త కాలేజీలు ఏర్పాట్ల అవసరం ఏర్పడింది. అదనపు సీట్లు అవసరం కూడా ఉండటంతో ఈ దిశగా ప్రభుత్వం సర్వే చేసింది. ప్రస్తుతం దాదాపు పది లక్షల మంది ఇంటర్ విద్య చదువుతున్నారు. ఉన్నత పాఠశాలలోనే ఇంటర్ విద్య ఉద్దేశంతో గత ప్రభుత్వం 292 పాఠశాలల్లో ప్రారంభించింది. వీటికి హై స్కూల్ ప్లస్ లుగా పేరు పెట్టారు. కానీ పూర్తి స్థాయిలో బోధనా సిబ్బందిని కేటాయించలేదు. అదే పాఠశాలల్లో అర్హత కలిగిన టీచర్లకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పదోన్నతి కల్పించి వారికి ఇంటర్ బోధనకు కేటాయించారు. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే జూనియర్ కాలేజీలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయన్న విషయాలు
ఏపీలో కొత్తగా 53 మంది జూనియర్ కాలేజీలు.. ఏర్పాటుకు త్వరలోనే నోటిఫికేషన్ – Sneha News
22