Home సినిమా ‘దూరపు కొండలు నునుపు’.. అనసూయ వేసిన ఈ ట్వీట్‌ ఎవరి గురించి? – Sneha News

‘దూరపు కొండలు నునుపు’.. అనసూయ వేసిన ఈ ట్వీట్‌ ఎవరి గురించి? – Sneha News

by Sneha News
0 comments
'దూరపు కొండలు నునుపు'.. అనసూయ వేసిన ఈ ట్వీట్‌ ఎవరి గురించి?


నటి, యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్‌కి వచ్చింది. ఈరోజు ‘దూరపు కొండలు నునుపు’ అంటూ ట్వీట్ వేసిన అందర్నీ ఆకర్షిస్తోంది. అది ఎవరిని ఉద్దేశించి వేసిన ట్వీటో ఎవరికీ అర్థం కాకపోయినా నిన్న జరిగిన పుష్ప2 ఈవెంట్‌ గురించేనని అర్థమవుతోంది. సడన్‌గా అనసూయకు ఆ సామెత ఎందుకు గుర్తొచ్చినట్టు అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే అసలు ఏం జరిగిందో చెప్పు… చెబితేనే కదా తెలిసేది అంటున్నారు.

దూరపు కొండలు నునుపు అనే సామెతను ఉపయోగించటానికి కారణం ఏమై ఉంటుందా అని ఈవెంట్‌ని రూపొందిస్తుంది. ఈ ఈవెంట్‌కి రాజమౌళి, గోపీచంద్ మలినేని వంటి వారిని గెస్టులుగా పిలిచారు. రాజమౌళి తన స్పీచ్‌లో సుకుమార్ గురించి, బన్నీ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అసలు ఈ సినిమాకి పబ్లిసిటీ అవసరం లేదు అన్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. చివరగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఎలా ఉందో వివరిస్తూ… ఆ ఇంట్రడక్షన్‌కి దేవి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెబుతున్నారు. రాజమౌళి మాటలను ఎంతో ఆసక్తిగా వింటున్నాడు దేవి. ఇంకా తన గురించి ఏం చెబుతాడోనని ఆత్రుతగా ఉంది. ఆ సమయంలో పక్కనే వున్న అనసూయ దేని గురించో మాట్లాడాలని దేవిని పదే పదే డిస్ట్రబ్ చేస్తోంది. దేవి మాత్రం రాజమౌళి మాటల్నే వింటున్నాడు. అవేమీ పట్టించుకోని అనసూయ.. దేవిని విసిగిస్తోంది. దాంతో దేవి ఒక్కసారిగా చిరాకు పడ్డాడు. ఆ విజువల్స్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. రాజమౌళి తన గురించి ఇంకా ఏమైనా మాట్లాడతారేమోనని లేచి నిలబడే ప్రయత్నం చేశాడు దేవి. కానీ, రాజమౌళి మాటలు బన్నీ టర్న్ అవడంతో నిరాశగా తన సీటులో కూలబడ్డాడు. అనసూయ ఈరోజు ట్వీట్‌ చేసిన సామెత దేవిశ్రీప్రసాద్‌ గురించే అవుతుంది. మరికొందరు మాత్రం అది దేవి గురించి కాదని, అనసూయ, విజయ్‌ దేవరకొండ మధ్య ఎప్పటి నుంచో వార్ జరుగుతున్న నేపథ్యంలో కొండ అనే పదం వచ్చేలా ఆ సామెత వాడిదని కామెంట్ చేస్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్‌ అనేది అనసూయ చెప్పాల్సి ఉంది. మరి అనసూయ మనసులో ఏముందో.. ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్‌ చేసిందో.. తెలియాల్సి ఉంది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech