3
- మంత్రి లోకేష్ కు రూ.5 కోట్ల చెక్కు అందజేత
అమరావతి: కృష్ణా నదికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ భారీ విరాళంతో ముందుకు వచ్చింది. దివీస్ సీఈఓ దివి కిరణ్ ఆదివారం హైదరాబాదులో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును. ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు గాను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మరో రూ. 4.8 కోట్లను దివీస్ సంస్థ అందజేసింది. మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన దివీస్ సంస్థను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు వస్తున్న దాతలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.