Home ఆంధ్రప్రదేశ్ నేడు అనంతపురం జిల్లాలోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. షెడ్యూల్ ఇదే – Sneha News

నేడు అనంతపురం జిల్లాలోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. షెడ్యూల్ ఇదే – Sneha News

by Sneha News
0 comments
నేడు అనంతపురం జిల్లాలోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. షెడ్యూల్ ఇదే


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో ఉన్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీకి సంబంధించి అనంతపురం జిల్లా నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతపురం నేమకల్లులో చంద్రబాబు అదనపు పెన్షన్లు జిల్లా చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. డిసెంబర్ నెలలో పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను ఇప్పటికే తీసుకుంది. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఆరోజు పెన్షన్ పంపిణీ చేయడం ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యలకు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే నవంబర్ 30వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. 100 శాతం పెన్షన్లను శనివారమే పంపిణీ చేసేలా ఇప్పటికే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సచివాలయం ఉద్యోగులు ఉదయాన్నే ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా కలిగి ఉన్నారు. టెన్షన్లు పంపిణీ అనంతరం రచ్చబండ తరహాలో గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పార్టీ నేతలతోపాటు పూర్తి అధికారులు చేశారు.

అనంతపురం పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు. 11:40 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12:25 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. 12:45 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెమకల్లు హెలీ ప్యాడ్ కు చేరుకుంటారు. 12:45 గంటల నుంచి 12:50 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. 12:50 గంటల నుంచి 1.20 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 1.20 గంటలకు హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1.25 గంటలకు నెమకల్లు ఇందిరమ్మ కాలనీకి చేరుకుంటారు. ఆ తరువాత 1.25 గంటల నుంచి 1.55 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం 1.55 గంటల నుంచి రెండు గంటల వరకు నేమకల్లులోని ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత 3.05 గంటల వరకు స్థానిక ప్రజలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3.10 గంటలకు నేమకల్లు హెలిప్యాడ్ కు చేరుకొని 3:15 గంటలకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అనంతరం 3.45 గంటలకు బెంగళూరు బయలుదేరుతారు. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ చేరుకుంటారు.

భూమ్మీద ఉన్న స్త్రీలందరికీ గోమాత శాపం.. ఆ శాపమేంటో తెలుసా..?
ఇసుక తిన్నెల్లో.. బ్లూ కలర్ బికినీలో.. జారా యాస్మిన్ హాట్ పిక్స్

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech