20
నటి సమంత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుసుకుని సమంత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. “మళ్ళీ మనం కలిసేవరకు డాడ్” అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజితో పోస్ట్ చేసింది. తండ్రి మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ గా ఉండు సామ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.