సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో, ఫోటో మార్ఫింగ్ లతో,గత ఎన్నికల ముందు చంద్రబాబు(chandrababu naidu)పవన్(pawan kalyan)లోకేష్(lokesh)పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)ధూషణలకి దిగిన విషయం తెలిసిందే.దీంతో ఒంగోలులో పోలీస్ కేసు నమోదైన దృష్ట్యా విచారణకు హాజరు అవ్వమని పోలీసులు గత కొన్ని రోజులుగా కోరుతుంటే వర్మ మాత్రం పరారీలో ఉన్నాడు.
ఇప్పుడు ఈ కేసులో వర్మ కి ఒక చిరు హీరో ఆశ్రయమిచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇండస్ట్రీలో చిన్న హీరోనే అయినా వర్మ అంటే అతనికి అభిమానమని తెలుస్తుంది.వర్మ పారిపోయే ముందు తన లాయర్ తో పాటు హీరోతో మాట్లాడినట్టుగా రుజువయ్యింది. దీంతో ఆ హీరో డైరెక్షన్ లోనే వర్మ దాక్కున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పోలీసులు ఈ సాయంత్రానికి వర్మ ని అరెస్ట్ చేసి ఏపి తీసుకెళ్తామని ఘంటా పదంగా చెప్తున్నారు.ఒక వేళ ఆచూకీ లభ్యం కాకపోతే ఆ హీరోని కూడా విచారిస్తామని చెప్తున్నారు. దీనితో ఆ హీరో ఎవరనే చర్చ అందరిలో మొదలయ్యింది.
ఇక వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నా కూడా ఐపి అడ్రస్ మాత్రం హైదరాబాద్ లో చూపిస్తుంది. దీంతో శంషాబాద్, షాద్ నగర్ లోని వర్మ రెండు ఫామ్ హౌస్ లపై పోలీసుల ఫోకస్ చేసారు.ముందు జాగ్రత్తగా చెన్నై,కోయంబత్తూరు,కేరళ,ముంబై లకి కూడా ప్రత్యేక బృందాలు వెళ్లాయి.ఆంధ్రప్రదేశ్ లోని మూడు కోర్టులలో వర్మ బెయిల్ కోసం అప్లై చేసాడు. దీంతో బెయిల్ వస్తుందన్న ఆశతోనే తప్పించుకు తిరుగుతున్నాడని తెలుస్తుంది.ఇక ఈ కేసులో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.