- రేవంత్ రెడ్డి అబద్దాలకోరు
- సంవత్సరం కాకముందే పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం
- మూసి ప్రక్షాళన కేవలం అవినీతి కోసమే
- మూసి ప్రక్షాళన మొదలుపెట్టిందే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్
- రేవంత్ రెడ్డి పై నమ్మకం లేక రైతులంతా దళారులకు మిల్లర్లకు ధాన్యం అమ్ముతున్నారు.
- తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు
- డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి ముద్ర: మహా వృక్షం లాంటి కెసిఆర్ ను ,బిఆర్ఎస్ పార్టీని పీకే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదని తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు . బుధవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్దాలకోరు, అబద్దాలకు పర్యాయపదంగా ఉన్నటువంటి దగాకోరు ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. మంగళవారం వరంగల్ లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ అనే మొక్కను ఇక ఎదగనీయ్యను అని ప్రగల్బాలు పలుకుతూ శపథం చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఎవరు మొక్క, ఎవరు మహావృక్షం, ఏ మొక్క ఎక్కడ మొలుస్తుంది, ఏ మొక్కను ఎవడు మొలవనీయుడు అనే కనీస సోయి లేకుండా మాట్లాడుతూ భావ దారిద్య్రం తో కొట్టుమిట్టాడుతున్న దౌర్భాగ్యుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు వరకు పెట్టిన ప్రతి మీటింగ్ లో కెసిఆర్ తిట్టడమే సీఎం పనిగా పెట్టుకున్నాడని. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర జాతిపిత, చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించి, 10 సంవత్సరాలు నిర్విరామంగా శ్రమించి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకపోయి తెలంగాణ అభివృద్ధి రేటును పెంచిన మహానీయుడు కేసీఆర్ అని అన్నారు. నాడు తుంగతుర్తి నియోజకవర్గంలో గోదావరి జలాలను తీసుకొచ్చి 1 లక్ష 20 వేల ఎకరాలకు నీరు అందించి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించడానికి దోహదపడిన ఘనత నాటి బిఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. కెసిఆర్ మహా వృక్షమని మర్రి చెట్టు కంటే ఎక్కువ అని ఆ చెట్టుకు ఉన్న ఊడను కూడా పీకే దమ్ము నీకు గాని నీ పార్టీ గాని లేదని చెప్పారు. ఒకవేళ పీకాల్సి వస్తే తులసి వనంలో గంజాయి మొక్కగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని పీకడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందనే చెప్పాలి.
నియంత్రించాల్సిన పోలీసులు ధర్నా చేస్తే దౌర్భాగ్య స్థితికి తెచ్చిన సీఎం రేవంత్ ను పీకాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు డిఏ తో పాటు రైతు భరోసా దిక్కే సహాయం. ఉచిత బస్సు, 200 యూనిట్లు ఏమయ్య అని ప్రశ్నించారు. చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ము లేక కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకుపోయిన నువ్వు నీతి వాక్యాలు మాట్లాడడం అస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రజలు నిన్ను ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలా భరించాలని అడుగుతున్న స్థితి గ్రామాల్లో నెలకొని ఉంది. కెసిఆర్ గుర్తులు లేకుండా చేయాలంటే ఆయనకంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయాలి. నాడు మూసి ప్రక్షాళన చేపట్టిందే బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. నాడు మూసి ప్రక్షాళనకు రూ.16 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 1,50 వేల కోట్లు ఎట్లా అయితదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2500 కిలోమీటర్లు ఉన్న గంగా నది పరిశుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా 40 వేల కోట్లు వెచ్చించిందని, మరి 150 కిలోమీటర్లు ఉన్న మూసి ప్రక్షాళనకు రు.1.50 వేల కోట్ల రూపాయలు.
ఎట్లా అయితదో చెప్పాలని ఇది స్కాం కాద అని నిలదీశారు. ఇది స్కాం కాబట్టి మూసి ప్రక్షాళన పేరుతో మీ జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే దానిని వ్యతిరేకిస్తున్నాం కానీ… మూసి ప్రక్షాళన కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని, లేకుంటే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని, ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కొట్లాడుతూనే ఉంటాం… ఏం చేసుకుంటావో చేసుకో అని హెచ్చరిక. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, తిరుమలగిరి మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, నాగరం మండల అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య,జిల్లా నాయకులు గండంగాని రాములు గౌడ్, దొంగరి శ్రీను, దుర్గయ్య, కడారి దాసు, గోపగాని శ్రీను, ఉప్పుల నాగమల్లు, ఉప్పు సైదులు, మట్టిపల్లి వెంకట్, వెంకన్న, నాయకులు, కార్యకర్తలు, చేసారు.