19
- ప్రజా సానుభూతి కోసమే పదే అరెస్టు అంటున్నాడు కేటీఆర్
- కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మేమేమీ కుట్ర చేయడం లేదు
- మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర, తెలంగాణ బ్యూరో : లగచర్ల గ్రామంలో ప్రభుత్వ అధికారులపై రైతుల దాడి ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం ఉందని పార్టీ నేతలే చెబుతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. తనను అరెస్టు చేస్తారంటా అని పదే పదే ప్రజల సానుభూతి కోసం కేటీఆర్ మాట్లాడకుండా ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి తామేమీ కుట్ర చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
సీనియర్ అధికారి ఆధ్వర్యంలో లగచర్ల ఘటనపై విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తి అయిన తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. లగచర్ల ఘటనలో కలెక్టర్, గ్రూప్ -1 అధికారిని చంపే కుట్ర జరిగింది. ఈ ఘటనకు సంబంధించి తామెవ్వరినీ తప్పుబట్టడం లేదని, రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని తెలిపారు.