Home తాజా వార్తలు తిరుప‌త‌న్న అడిగితే నెంబ‌ర్లు ఇచ్చా – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

తిరుప‌త‌న్న అడిగితే నెంబ‌ర్లు ఇచ్చా – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
తిరుప‌త‌న్న అడిగితే నెంబ‌ర్లు ఇచ్చా - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఫోన్ టాపింగ్ కేసులో ముగిసిన లింగయ్య విచారణ
  • లింగయ్య విచారణకు ముందు జూబ్లీహిల్స్ పీఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్యను పోలీసులు గురువారం విచారించారు. విచార‌ణ అనంత‌రం లింగ‌య్య మీడియాతో మాట్లాడారు. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్ పైన పోలీసులు విచారించాను. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, తనకు తెలిసిన అధికారి కావటంతో తాను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడినట్లు చెప్పారు. ఆ తర్వాత మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగాడని, వారి ఫోన్ నంబర్ల త‌మ అనుచరుల దగ్గర నుంచి తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకి ఇచ్చారన్నారు. అప్పుడే ఈ నంబర్లు ఎందుకని తిరుపతన్న ను ప్రశ్నించానని చెప్పారు లింగయ్య.

మునుగోడు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందని తిరుపతన్నపలుమార్లు అడిగాడని, ప్రచారం బాగా జరుగుతుందని తాను ఫోన్‌లో మాట్లాడానన్నారు. కాగా, వేముల వీరేశం అనుచరుల ఫోన్ టాప్ చేశానేది అవాస్తవం అని, కుట్రపూరిత’ ఉద్దేశంతో కొంతమంది త‌న‌పై కామెంట్స్ ప్ర‌సిద్ధం. ఈ కేసులో ఎప్పుడు విచారించడానికి పిలిచినా తాను పోలీసులకు సహకరిస్తానని, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే విచారిస్తున్నామని, పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉందని కాబట్టే విచారించారని మాజీ ఎమ్మెల్యే లింగయ్య చెప్పారు.

లింగయ్య.. అంతకు ముందే భాస్కర్ రావు

బీఆర్ఎస్ హయాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహరం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం పోలీసుల‌కే ప‌రిమితం అయిన ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల‌కు సైతం నోటీసులు అందుతున్నాయి. ఈ కోరనే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయ‌న‌తో మ‌రో ఇద్దరు నేత‌ల‌కు సైతం నోటీసులిచ్చారు. అయితే, అనూహ్యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో మిర్యాల‌గూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రత్యక్షమ‌య్యాడు. కొంతసేపు ఆయ‌న పోలీస్ స్టేష‌న్‌లోకి వెళ్లాడు. దాదాపు రెండు గంట‌ల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చాడు. దీంతో ఆయ‌న కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచార‌ణ‌కు వ‌చ్చాడా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech