సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి, పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టేది లేదని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో గురువారం మాట్లాడారు. వైసీపీ ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇది సహించేది కాదని మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కోర్టులు కూడా మొట్టికాయలు వేసి ఉన్నాయి. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని, ఆ తర్వాత పోస్టులు డిలీట్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ అటువంటి వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ తరహా దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని, సొంత తల్లిని, చెల్లిని తిట్టినవారిని జగన్ ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లిని, చెల్లిని తిట్టిన వారిని తాము అరెస్టు చేస్తున్నామని హోంమంత్రిని.
సోషల్ సైకోలకు జగనే నాయకుడని అనిత. వైసీపీ సైతాన్ సోషల్ మీడియా సైన్యానికి వైఎస్ జగనే నాయకుడని, తనపై తప్పుడు ప్రచారం కూడా చేసింది ఆయనేనని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపడిన ఈ సందర్భంగా మంత్రి అనిత గుర్తు చేశారు. సైతాన్ సైన్యంలో విషపు నాగులతోపాటు అనకొండను కూడా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది, తాము అదే పని చేస్తున్నామని. కఠినంగా వ్యవహరించకపోతే సైకో సోషల్ మీడియా ఆగడాలు ఆగవని మంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియా సైతాన్‌లకు జగన్‌మోహన్‌రెడ్డే ఈ తరహా ఆదేశాలు జారీ చేశారు, పోస్ట్‌లు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ఆర్జీవీపై కేసు నమోదైందని, తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ కేసులోనూ నోటీసులిచ్చే అవకాశం ఉందనీ, ట్విట్టర్‌లో తనదైన స్టయిల్‌లో రియాక్ట్ కావడం వర్మకు అలవాటన్నారు.
ఏపీ అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం..
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం గురువారం ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిలో ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ చట్ట సవరణ బిల్లు, ఆయుర్వేదిక్, హోమియో ప్రాక్టీషనర్ మెడికల్ ప్రాక్టీషనర్ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టారు. ల్యాండ్ గ్రాబిషన్ ప్రోహిబిషన్ బిల్లును, శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విద్యుత్ సుంకం చట్ట సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత పురస్కారం ప్రకటించిన డొమినికా
బీట్‌రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి