Home తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • యూనివర్సిటీలో ఐదెకరాల స్థలంపై వివాదం
  • మల్లారెడ్డి కబ్జా చేశారంటూ న్యాయవాదులతో బాధితుల ఆందోళన

ముద్ర, తెలంగాణ బ్యూరో : పీజీ మెడికల్‌ సీట్లలో అక్రమాలకు ఎదురవుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో సమస్య వచ్చింది. మల్లారెడ్డి యూనివర్సిటీ స్థలంలో ఐదెకరాలు తమకు చెందినవంటూ బాధితులు తెరపైకి వచ్చారు. సమాచారం కొలిచేందుకు సర్వేయర్లు, అడ్వకేట్‌తో వచ్చిన బాధితులను స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వారికి కోర్టు ఆదేశాలు ఇస్తేనే కొలవనిస్తామంటూ స్థానికులు తేల్చి చెప్పారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

బహదూర్ పల్లికి చెందిన పిట్ల వీరయ్య అనే వ్యక్తికి 641, 642, 643, 644 సర్వే నెంబర్లలో ఏడెకరాల తొమ్మిది గుంటల స్థలం ఉండేదని బాధితులు తెలిపారు. పిట్ల వీరయ్యకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఓ కొడుకు ఉన్నారని చెప్పారు. ఏడెకరాల తొమ్మిది గుంటల ముగ్గురు కొడుకులు సమానంగా పంచుకోవాలని వీలునామా కూడా రాసుకున్నారని.. అయితే 1970లో 641 సర్వే నెంబర్‌లోని రెండెకరాలను మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డికి పిట్ల వీరయ్య మొదటి భార్య కొడుకులు పిట్ల చంద్రయ్య, పిట్ల నరసింహులు అమ్మేసినట్టు వివరించారు. అయితే 642, 643, 644 సర్వే నెంబర్లలో ఉన్న మిగిలిన ఐదెకరాలను కూడా మల్లారెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేశామని, సర్వే చేయించుకొని ఎవరికి వారు కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చారని బాధితుడు పిట్ల యాదగిరి తరఫు అడ్వకేట్ ఇచ్చారు. ఒక వర్గానికే కోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్లే సర్వేను నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తంగా ఓ పక్క ఈడీ నోటీసులు.. మరోపక్క మల్లారెడ్డి యూనివర్సిటీలో తమకు ఐదెకరాల స్థలం ఉందంటూ బాధితులు ఆందోళనకు దిగడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech