ఏపీలో పోలీసులు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. గడచిన కొన్నాళ్లుగా పోలీసుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. 2014 – 19 మధ్య అధికారంలో ఉండగా వైసీపీకి ఎంతో మందిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వ ఒత్తిడికి మించి వ్యవహరించిన పోలీసు అధికారులు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏపీ వెంకటేశ్వర్లను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. మరికొందరు అధికారులను కూడా పక్కన పెట్టింది. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత వైసిపి ప్రభుత్వంలో పరిధికి మించి వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టారు. జత్వాని కేసులో అతిగా వ్యవహరించారంటూ ముగ్గురు పోలీసు అధికారులను పక్కన పెట్టింది. మరి కొన్ని జిల్లాలకు చెందిన పోలీసు అధికారులను ప్రభుత్వం ప్రభుత్వం సరెండర్ చేయడంతో పాటు కొన్నిచోట్ల సస్పెన్షన్ కూడా విధించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది అంటూ వైసీపీకి చెందిన పలువురిని అరెస్టు చేస్తోంది. గడచిన మూడు రోజులుగా బదులు సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. మరింత మందిని అరెస్టు చేయాలంటూ ప్రభుత్వం నుంచి పోలీసులకు ఒత్తిడి ఉంది. నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి వారి నుంచే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిబంధనలను అతిక్రమించి మరి కొందరిని అరెస్టు చేస్తున్నారు. వైసిపి తీవ్రస్థాయిలో హెచ్చరికలను జారీ చేసింది. చట్టాన్ని అతిక్రమించి వైసిపి కార్యకర్తలను వేధింపులు గురిచేసే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సప్త సముద్రాలు అవతల ఉంచి శిక్షిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక. ఈ హెచ్చరికతో ప్రస్తుతం పోలీసులలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పెద్దలనుంచి ఇబ్బందులు ఎదురవుతాయి, ఒకవేళ చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో వైసీపీతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పోలీసులు మదన పడుతున్నారు. ఈ తరహాలో ఏం చేయాలో కూడా తెలియడం లేదంటూ పోలీసులు చెబుతున్నారు. ముందుకు వెళితే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్న చందంగా తయారైంది తమ పరిస్థితి అంటూ పలు పోలీస్ ఉన్న అధికారులు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెలవులు పెట్టుకుని వెళ్లిపోవడానికి చాలా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు అధికారుల సంగతి తేల్చడంతోపాటు తమ కార్యకర్తలను వేధించే వారిపై ప్రైవేటు కేసులు కూడా పెడతామంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ తరహా కేసులను ఎదుర్కోవడం కూడా పోలీసులకు ఇబ్బందిగా పరిణమిస్తుంది. దీంతో వైసీపీ హెచ్చరికలతో కొందరు పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర ఒత్తిడి ఉండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ కొందరు పోలీసులను గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అతిగా కూటమిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు అధికారులపై కేసులు వేసేందుకు అనుగుణంగా వైసీపీని ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న ఇబ్బందిగానే ఉంటుందంటూ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పోలీసులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Paranting Tips : నిద్రకు ముందు పిల్లలకు కథలు చెప్పడం ఎందుకు తప్పనిసరి.. వాటి లాభాలివే…
నాయకుడిగా ఎదగాలంటే చాణక్యుడు చెప్పిన 4 లక్షణాలు ఇవే..