ఒక సినిమా విజయంలో మ్యూజిక్‌లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాని ఎంత గొప్పగా తీసినా, దానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరితేనే ఆ సీన్స్‌లోని ఎమోషన్ కరెక్ట్‌గా క్యారీ అవుతుంది. అలాగే సిట్యుయేషన్‌కి తగ్గట్టు వచ్చే పాటలు సినిమాకి మరింత వన్నె తీసుకొస్తాయి. సినిమా పుట్టిన నాటి నుంచి ఎంతో మ్యూజిక్ మందిస్లో తమ అత్యుత్తమ ప్రతిభను డైరెక్టర్ మధురమైన పాటలను అందించారు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా చివరి వరకూ అందులోనే కొనసాగారు తప్ప మిగిలిన శాఖల జోలికి వెళ్లలేదు. కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని బ్రేక్ చేస్తూ టి.రాజేందర్, ఎస్.వి.కృష్ణారెడ్డి డైరెక్షన్‌తోపాటు సంగీతాన్ని కూడా అందించేవారు. కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరో అవ్వడం అనేది అప్పట్లో లేదు.
విజయ్ ఆంటోని సంగీతం అందిస్తూనే హీరోగా సినిమాలు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. అతను హీరోగా నటించిన మొదటి సినిమా నకిలీ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. విజయ్ ఆంటోని బాటలో మరో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఇతను ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత సంగీత దర్శకుడు 100 సినిమాలు పూర్తి చేయడం సాధారణ విషయం కాదు. కానీ, జి.వి.ప్రకాష్ ఆ ఘనత సాధించబోతున్నాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే మ్యూజిక్ డైరెక్టర్‌గా 100 సినిమాలు పూర్తి చేసి రికార్డు సృష్టించబోతున్నారు జి.వి.ప్రకాష్.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎ.ఆర్.రెహమాన్, హెరిస్ జయరాజ్, యువన్ శంకర్‌రాజా, దేవిశ్రీప్రసాద్, తమన్, అనిరుధ్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతంలో తన స్పెషాలిటీ ఏమిటో చూపించుకొని జివి.ప్రకాష్ ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా విశేషమే. తన ప్రతి సినిమాలోనూ సూపర్‌హిట్ సాంగ్స్ ఉంటాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేస్తుంది. గత వారం విడుదలైన అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్. నవంబర్ 14న విడుదల కాబోతున్న వరుణ్‌తేజ్ కొత్త సినిమా ‘మట్కా’కి కూడా జి.వి.ప్రకాషే మ్యూజిక్ డైరెక్టర్. ఇదిలా ఉంటే.. జి.వి.ప్రకాష్ 100వ సినిమా ఫిక్స్ అయింది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకి మ్యూజిక్ ద్వారా 100 సినిమాల సంగీత దర్శకుడిగా వార్తల్లోకి ఎక్కబోతున్నారు.
హీరోగా నటిస్తూ మ్యూజిక్ డైరెక్టర్‌గా 100 సినిమాలు పూర్తి చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం గురించి జి.వి.ప్రకాష్ ‘నేను నటించినప్పటికీ నా ప్రయారిటీ మ్యూజిక్ డైరెక్షన్‌కే ఇస్తాను. అందుకే నెలలో 12 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొంటున్నాను. మిగిలిన టైం మొత్తం మ్యూజిక్ కోసమే కేటాయిస్తాను. ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తున్నానంటే నాకు సంబంధించిన వర్క్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఉండకూడదన్నది నా పాలసీ. అందుకే సినిమా రిలీజ్ కి వారం ముందే నా వర్క్ పూర్తి చేస్తాను. అందుకే మ్యూజిక్ చేయమని నిర్మాతలు నా దగ్గరికి వస్తారనుకుంటున్నాను’ అంటూ జి.వి.ప్రకాష్‌కుమార్ వివరించారు.