- కులగణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉంది
- వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకు ?
- కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు
- రేవంత్ సర్కార్ మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకునే యత్నం
- మూసీ పునరుజ్జీవనానికి బీజేపీ వ్యతిరేకం కాదు
- ప్రజాధనాన్ని దోచుకుంటే సహించం
- బీజేపీ ఎంపీ డీకే ఆరుణ ఫైర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : కుల గణన సర్వే దేనికి సంబంధించిన కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. కుల గణనలో వ్యక్తిగత నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నావళి లేదని, వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ఆమె నిలదీశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లో మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడారు.. రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ కులగణన చేపట్టారు. కులగణన ప్రశ్నావళిలో ప్రజల ఆస్తులు, అప్పులు, భూములు వంటి వివరాలను ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. చివరకు ప్రజలు ఏ పార్టీకి చెందినవారని ప్రశ్నిస్తూ ఒక కాలమ్ ప్రకటించారు. ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారోననే వివరాలు ప్రభుత్వానికి ఏం అవసరమన్నారు. ప్రజలు ఇచ్చిన వివరాలను మాత్రమే స్వీకరించాలన్నారు.
ప్రజల నుంచి బలవంతంగా వివరాలను స్వీకరిస్తూ చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని ఆమె తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తుంది. అరవై ఏళ్ళ పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కులగణన చేపట్టలేదని, మరి రేవంత్ సర్కార్ ఇప్పుడేం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. బీసీలను, ప్రజలను మోసం చేయడానికే ఈ కులగణన సర్వే చేస్తున్నారు. కులగణనపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే 2014లో అప్పటి బీఆర్‌ఎస్ చేపట్టిన సర్వే రిపోర్ట్‌ను బయట పెట్టాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి మరల్చెందుకే కాంగ్రెస్ సర్వే పేరుతో నాటకానికి తెరలేపింది. ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీసీ జెండా ఎజెండాతో ముందుకు వస్తుందన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని ఆమె దుయ్యబట్టారు.
కళ్యాణలక్ష్మీ పథకం కింద ఇస్తామన్న తులం బంగారం ఎక్కడని ఆమె ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ఎక్కడెక్కడ? ఎంత మందికి రూ. 10లక్షల విలువైన వైద్య సేవలు అందించారో వివరాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఎస్ రెండు దోపిడీ పార్టీలేనని ఆమె తెలిపారు. గతంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలాది కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆమె. మూసీ పునరుజ్జీవం పేరుతో భారీ మొత్తంలో దోపిడికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతోందని అన్నారు. మూసీ పునరుజ్జీవనానికి బీజేపీ ఏ మాత్రం వ్యతిరేకం కాదన్నారు. ఆ ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తే కచ్చితంగా అడ్డుకుని తీరుతామని డీకే ఆరుణ హెచ్చరిక.