- ముద్ర పత్రిక వార్తకు స్పందించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి ముద్రణ:- మండల పరిధిలోని వెంపటి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన సిగ గౌతమి ఇటీవల నీట్ ఫలితాల్లో మంచిర్యాంకు సాధించి ఎంబీబీస్లో స్థానం సాధించగా కాలేజీలో చేరేందుకు ఫీజు కట్టలేక కూలి పనికి వెళుతున్న ఆ బిడ్డ వ్యధను ముద్ర పత్రిక కథనం ద్వారా తెలుగచ్చిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డాక్టర్దరి కిషోర్‌కుమార్ తన నివాసంలోకి వెళ్లిన విద్యార్థికి డా. . 50 వేల ఆర్థిక సహాయం అందించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కష్టపడి చదువుకొని పెంచిన నానమ్మ తాతయ్యలకు మంచిపేరు తేవాలని, డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని విద్యార్థికి సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తునికి సాయిలు, కొండగడుపుల నాగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు దేశ బోయిన హరీష్, జెక్కి సతీష్, విద్యార్థిని బాబాయి సిగ మధు నిర్వహించారు.