Home తెలంగాణ కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు.. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • సర్కార్ కు రూ. 2వేల కోట్లు ఆదా
  • అదే ఖర్చుతో గోదావరి ఫేజ్ 2 పనుల పొడగింపు
  • మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాలు, గ్రేటర్ కు తాగునీరు
  • ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సర్కార్
  • ఇటీవల ఆమోదం తెలిపిన మంత్రివర్గం
  • త్వరలోనే టెండర్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హైదరాబాద్ శివారులలో నిర్మించతలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను రద్దు చేసింది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా ఆ నది జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్ కు.. అక్కడి నుంచి హైదరాబాద్ కు స్థలాల పేరుతో గత ప్రభుత్వం డిజైన్ చేసి ఈ డొంక తిరుగుడు పనులను విరమించుకుంది. ఈ మేరకు మెఘా ఇంజనీరింగ్ కంపెనీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగం బుధవారం జీవో జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవపురం రిజర్వాయర్, అందులో భాగంగా చేపట్టే పనులకు దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అదే ఖర్చుతో.. గోదావరి ఫేజ్ 2 స్కీమ్ ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ అవసరాల కోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగునీరు సరఫరా చేయడంతోపాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలు అందజేసేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఆరేండ్లయినా సాగని పనులు..!

పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవపురం చెర్వు నింపుతారు. కేశవపురం చెర్వును 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ గా నిర్మిస్తారు. అక్కడి నుంచి ఘన్పూర్ మీద హైదరాబాద్‌కు 10 టీకాల అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే టెండర్లు ఖరారై ఆరేళ్లయినా ఈ పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్‌మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంపిక పైపులైన్ సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగలేదు. పనులు ఆగిపోయాయి. అదే సమయంలో ఈ టెండర్లను స్వాధీనం చేసుకున్న మేఘా కంపెనీ ఈ పనులు చేపట్టకుండా వదిలేసింది. 2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పనులు చేపట్టలేమని, 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని మేఘా ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది.

ఈ ధరల పెంపును రద్దు చేయడంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా మేఘా కంపెనీకి కేటాయించిన టెండర్లను రద్దు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. తక్కువ ఖర్చుతో గ్రేటర్ సిటీకి సరఫరాతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీటిని నింపడానికి ఎక్కువ భాగం గ్రావిటీతో వచ్చేలా కొత్త అలైన్‌మెంట్ ప్రకారం పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గోదావరి నీటిని హైదరాబాద్‌కు తరలించడానికి ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలిగిపోతున్నాయి. కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి అయ్యే ఖర్చు తగ్గిపోవడంతో పాటు అక్కడ ఆదా అయ్యే ఖర్చుతో ఇంతకాలం నిర్యక్షానికి గురైన ఉస్మాన్ సాగర్ , హిమాయత్సాగర్ రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. కొత్త రూట్ ప్రకారం..కొండపోచమ్మసాగర్, కేశవపురం జోలికి వెళ్లకుండా.. అటువైపు దారి మళ్లించకుండా.. నేరుగా మల్లన్నసాగర్ నుంచి.. అక్కడి నుంచి హైదరాబాద్ ఇప్పటి వరకు 10 టీఎంసీలు, జంట జలాశయాలకు మరో 5 టీఎంసీలు పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

15 టీటీసీల నీటి నిల్వ సామర్థ్యమున్న కొండపోచమ్మసాగర్ తో ప్రస్తుతం 50 టీఎంసీల కెపాసిటీ ఉండే మల్లన్నసాగర్ లో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. స్లూయిస్ లెవెల్ ప్రకారం.. కొండపోచమ్మ సాగర్ లో 8 టీఎంసీల నీళ్లుంటే తప్ప నీటిని పంపింగ్ చేయడం కుదరదని పరిస్థితి. అదే మల్లన్నసాగర్ లో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేసుకునే వీలుంటుంది. అందుకే కొండపోచమ్మసాగర్ కు బదులుగా నేరుగా మల్లన్నసాగర్ ను సోర్స్ గా వాడుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పాత ప్రాజెక్టులకు మార్పులు చేసింది. పాత ప్రాజెక్టుల ప్రకారం హైదరాబాద్ కు ఇప్పటికే సరఫరా చేయడానికి అక్కారం, మర్కూర్, కొండపోచమ్మసాగర్, బొమ్మరాసిపేట, ఘన్‌పూర్ వద్ద మొత్తం 5 చోట్ల నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది.

కొత్త ప్లాన్ ప్రకారం మల్లన్నసాగర్, ఘన్పూర్.. కేవలం 2 చోట్ల నీటిని పంపింగ్ చేస్తే సరిపోతుంది. అయిదు చోట్ల పంపింగ్ చేసే బదులు రెండు చోట్ల పంపింగ్ చేయటం, మిగిలిన చోట్ల గ్రావిటీతో నీటి సరఫరా జరిగే వీలుంది. దీనితో ఖర్చుతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ భారం తగ్గుతుంది. ఆ మేరకు కరెంటు ఛార్జీల భారం కూడా తగ్గుతుంది. పాత ప్రాజెక్టులో పైపులైన్ పొడవు కేవలం 71.9 కిలోమీటర్లు. ఇప్పుడు ఉస్మాన్ సాగర్ వరకు దాదాపు రూ.162 ప్రాజెక్టును పొడిగించనుంది. ఈ గ్రేటర్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీరనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒక కేఎల్‌డీకి కేవలం రూ.4 ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూసీ పునరుజ్జీవనంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లో గోదావరి జలాలను నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వ భారీ సంకల్పం నెరవేరనుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech