- కేవలం రాజకీయ లబ్ధికే కులగణన
- కులగణనపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ సిద్ధమా ?
- కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు
- బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీసీల ఓటు బ్యాంక్ కోసమే అధికార కాంగ్రెస్ పార్టీ హడావుడి చేస్తోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదని, అయితే కేవలం రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ సర్కార్ కులగణన సూచించిందని ఆయన గుర్తింపు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర మీడియాతో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. కులగణనపై ప్రభుత్వానికి సూచించారా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ సర్కార్ చేసిన కుటుంబ సర్వే వివరాలను ఎందుకు బహిర్గం చేయడం లేదని, దీని వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన 21 హామీలను నెరవేర్చకుండా కులగణన పేరుతో కాలయాపన చేసినట్లు ఆయన దుయ్యబట్టారు.
రేవంత్ మంత్రివర్గంలో పదిమంది మంత్రులు ఉంటే, కేవలం ఇద్దరు మాత్రమే బీసీలు కావడం గమనార్హం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తత్సారం చేస్తోందని ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గణన చేపడుతున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన తెలిపారు. కులగణనపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమగ్ర సర్వే పేరుతో గతంలో కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కులగణన పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందని ఆయన. ఇటీవల తెలంగాణ పర్యటనకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కులగణన గురించి మాట్లాడే నైతిక హక్కు సహాయం. తెలంగాణలో కులగణన పేరు చెప్పుకుని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆయన ఎద్దేవా చేశారు. కులగణనపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. చర్చకు ఎక్కడికి రమ్మంటారో తామ వస్తామని మహేశ్వర్ రెడ్డి అన్నారు.