Home తాజా వార్తలు మేఘా సంస్థని దేశమంతా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

మేఘా సంస్థని దేశమంతా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
మేఘా సంస్థని దేశమంతా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • అమృత్ టెండర్లను పొంగులేటి కంపెనికి ఎందుకు ఇచ్చారు
  • త్వరలోనే ఆయన జైలుకు వెళ్తారు
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :- సుంకిశాల ఘటనకు కారణమైన మేఘా సంస్థ దేశమంతట బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మేఘా కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. దొంగలు.. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఉన్నది సీఎం రేవంత్ యవ్వరమని. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడే చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు..సాగునీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారని అన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారని చెప్పారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మూసీని కూడా టెండర్లు కాకముందే మేఘాకు అందిస్తున్న అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోందన్నారు. . గోదావరి నీళ్లను హైదరాబాద్ కు తెచ్చేందుకు రూ. 11 వందల కోట్లతో అయిపోయే దానికి రూ. 5500 కోట్ల భారీ స్కాన్ చేయబోతున్నారని జోస్యం చెప్పారు. నగరానికి నీళ్లు తీసుకురావటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టింది. కానీ ఈ ప్రభుత్వం. మంత్రివర్యులు అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుంకిశాల ప్రాజెక్ట్ ను ఎందుకు పట్టించుకోలేదు.. సుంకిశాలలో మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్స్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ జాబితా అసలు బయటకు తెలియకుండా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం దాచి ఉంచింది. ఎందుకు దాచి పెట్టారో చెప్పాలంటూ నేను గతంలోనే డిమాండ్ చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రమాదం పై జ్యూడిషీయల్ ఎంక్వయిరీ కోరాను, కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేసి అడిగాను” అని కేటీఆర్ చెప్పారు.

కాంట్రాక్ట్ రద్దు చేయాలి

“మేడిగడ్డ ఘటనతో కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లు సుంకిశాల ప్రమాదాన్ని మాత్రం దాచి పెట్టారు. మొత్తం సంఘటనల్లో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. అంతేకానీ కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ బ్లాక్ కమిటీయే మేఘా కంపెనీ లిస్ట్‌లో పెట్టాలని రిపోర్ట్ ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేకపోవడం శోచనీయమని. పైగాకొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 4350 కోట్ల టెండర్ ను మేఘా సంస్థకు అప్పగించారు. బ్లాక్‌లిస్ట్ పెట్టాలని చెప్పిన సంస్థకు ఎందుకు కాంట్రాక్ట్ కట్టబెట్టాల్సి వచ్చింది. అసలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పెద్ద కుంభకోణమన్నారు.

ఇందులో సీఎం వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత? అంటూ రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. “మొన్న స్కిల్ యూనివర్సిటీ కోసం రూ. 200 కోట్ల విరాళాన్ని ప్రాజెక్ట్ లు కట్టబెట్టినందుకే ఇచ్చారా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు విధులు నిర్వహిస్తున్నారు… బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదని సూచించారు. వాళ్ల ఉద్యోగాలు ఊడటం ఖాయం. ఎక్కడ బిడ్ లు చేస్తున్నారో ఆ సంస్థ పేరు కూడా మాకు తెలుసు

పొంగులేటి నువ్వు ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో…!

మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సంబంధించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. “కోహినూర్ హోటల్‌లో అదానీ కాళ్లు మొక్కి ఏం కాకుండా పొంగులేటి బతిమిలాడుకున్నాడు. అమృత్ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు విచారణ జరపడం ప్రారంభించాడు. పొంగులేటి అరెస్ట్ అవుతాడంటూ అందరి జాతకాలు చెబుతున్నాడు.

అదానీతో మీ సంబంధాలు ఏ విధంగా బలపడుతున్నాయో మాకు తెలుసు. అమృత్ టెండర్ల ముఖ్యమంత్రి బావమరిదికి రూ. 11 వందల కోట్ల పనులను ఎలా ఇస్తారంటూ కేంద్రమంత్రి నేను ఉత్తరం రాస్తే ఇప్పటి వరకు స్పందన.. గౌతమ్ అదానీ కొడుకుతో నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి ఇంట్లోనే చర్చలు జరిపారు. మోడీ కోసం దామగుండం, అదానీకి సిమెంట్ ఫ్యాక్టరీ, మేఘా కృష్ణా రెడ్డికి అన్ని ప్రాజెక్ట్‌లు ఇస్తున్నారు. రాయదుర్గంలో 84 ఎకరాలు కూడా ఆదానీకి అప్పజెప్పే ప్రయత్నం చేసింది..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech