పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. వచ్చే జనవరి ఏడాది నుంచి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా ఈ పెన్షన్లను అందించనుంది. ఇందుకు సంబంధించిన చర్యలను తీసుకోవాల్సిందిగా సెర్ప్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు అందజేసేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను నియమించారు. నవంబర్ నుంచి కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకునేందుకు సౌకర్యం కల్పించనున్నారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను డిసెంబర్‌లో పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి జనవరి నుంచి వారికి కొత్త పెన్షన్లు అందించనున్నారు. తాజాగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు స్పష్టం చేశారు. వితంతు పెన్షన్లు పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దరఖాస్తు చేసిన మొదటి నెల నుంచి వారికి పెన్షన్లను అందించనుంది.
గత ప్రభుత్వ హయాంలో అనర్హులైన వారికి పెన్షన్లు అందించినట్లు ఫిర్యాదులు అందాయి. వీటి పైన ప్రత్యేకంగా దృష్టిసారించిన ప్రభుత్వం ఆయా పెన్షన్లు పరిశీలించాలని నిర్ణయించింది. అనర్హులైన వారిని గుర్తించి ఆయా పెన్షన్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులైన వారి వివరాలను గ్రామ వార్డు సచివాలయాలు భారీగా పంపించి మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిపై నిర్ధారణకు రానున్నారు. అనర్హులుగా తేలితే వాటిని తొలగించనున్నారు. అలాగే పెన్షన్లు పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం నెలవారీ పెన్షన్లను లబ్ధిదారులు ప్రతినెలా తీసుకోవాలి. రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ ఒకేసారి తీసుకొనే వెసులుబాటు లేదు.
ఇకపై మూడుకు సంబంధించిన పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ నుంచి ఈ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విషయాలను ప్రభుత్వం అధికారులకు జారీ చేసింది. డిసెంబర్‌లో తీసుకోలేని పెన్షనర్లు జనవరిలో రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు. రెండో నెలలో కూడా తీసుకోలేకపోతే మూడు నెలలు కలిపి పెన్షన్ ను లబ్ధిదారులు తీసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల వేలాదిమంది పెన్షనర్లకు మేలు చేకూరనుంది. రాష్ట్రంలో అనేక మంది పించన్ దారులు అనేక అవసరాల రీత్య సొంత గ్రామాలకు దూరంగా ఉన్నారు. వీరంతా ప్రతినెల పెన్షన్లు తీసుకునేందుకు సొంత గ్రామాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది వారికి ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఇటువంటి సమస్యలను గుర్తించిన ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకొని డిసెంబర్ నుంచి అమలు చేయబోతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ | ఆరెంజ్ డ్రెస్ లో కొంటె చూపులతో మతులు పోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్
చలికాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చిట్కాలు