కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ మాజీ కాంటెస్ట్, సినీనటి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి(హర్ష సాయి)తన దగ్గర రెండు కోట్ల రూపాయల డబ్బు తీసుకోవడంతో పాటు ఆసక్తిగా వేధించాడని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన హర్ష కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసాడు.దీంతో కోర్టు హర్ష కి బెయిల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో హర్ష సాయి తొలి సారి మీడియాతో మాట్లాడుతు ఇన్ని రోజులు వేరే పని మీద బయట ఉండాల్సి వచ్చింది. రెండు కోట్ల రూపాయలని ఎవరకి పడితే వాళ్ళకి ఇవ్వను.అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను.డబ్బు కోసం ఎవరైనా సరే బ్లాక్ మెయిల్ చేస్తే భయపడాల్సిన పని లేదు.అందుకే నా మీద వచ్చిన ఆరోపణల మీద ఫైట్ చేశాను.నిజా నిజాలు అర్ధం చేసుకొని కోర్టు బెయిల్ ఇచ్చింది. ఫ్రీ గా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే నా మీద కేసు వేసారు. ఒక సినిమా కథ విషయంలో మోసం చేసారని అనేది కూడా అబద్దమే. ఎందుకంటే ఆ కథ కూడా నాదే అని చెప్పుకొచ్చాడు.