- రైతాంగం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది
- దొంగ లెక్కలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం అంటోంది
- గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలుగా విద్యుత్ కోతలు
- 2014 కు ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి
- కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ము రేవంత్ కు ఉందా
- విద్యుత్ కమీషన్ పై కావాలనే లీకులు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :- అబద్దపు హామీలతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డికి…ముందుంది ముసళ్ళ పండగ అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం సంవత్సరం కాలం కూడా పూర్తి కాకముందే…. అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ కాలంలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం దేశంలో ఇదేనా ఉందంటే ….అది కేవలం రేవంత్ సర్కార్ మాత్రమేనని ధ్వజమెత్తారు.
ఆదివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానంగా రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి రోజురోజుకు దిగజారుతో ఉంది.దొంగ లెక్కలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం ఏంటోందని. పైగా రుణమాఫీని దేశం మొత్తం చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందన్నారు. రైతు భరోసా ఇవ్వమని రైతులు మొత్తుకుంటున్నా…..రేవంత్ సర్కార్ మొద్దునిద్ర పోతోందని..రైతులు పండించిన పత్తిని ప్రభుత్వం కొనడం సాయం.వరి ధాన్యం కేంద్రాలు లేకపోవడంతో రైతులు ధాన్యం కళ్లల్లో ఆరబోసుకుంటున్నారు. కనీసంప్రభుత్వం ఇప్పటి వరకు మిల్లర్లతో చర్చలు జరపాలి.వరి ధాన్యం,పత్తి కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో గొనె సంచులు లేవన్నారు. సన్న వరి ధాన్యానికి రూ. 500ల బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పి మోసం చేసింది. ప్రజల సమస్యలతో అల్లాడుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర రాష్ట్రాల్లో మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరిగింది.
రాష్ట్రంలో పత్తి పంటకు కేంద్రం రూ. 7వేల మద్దతు ధర మాత్రం….గుజరాత్ లో రూ. 8వేల మద్దతు ధర ఇచ్చాం. అయినప్పటికీ కేంద్రఎవరు అడగడం. కమీషన్ విచారణ పూర్తి అయితే నివేదిక ఎందుకు బయట పెట్టలేదు అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంలో కేసీఆర్ ను జైల్లో ఎందుకు పెడతారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా అని అడిగారు. 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా.. విద్యుత్ సంస్కరణలు చేసినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. అలాగే ఒవైసీ గురించి ముస్లిం సోదరులను అడిగితే చెబుతారు. మూసి ప్రక్షాళన చేస్తాం అని మేమే చెప్పాము. ఒవైసీ కొత్తగా చెప్పేది ఏమున్నది.