- రాష్ట్రంలో రుణమాఫీ పై మోదీ ట్వీట్ చేశారు
- కాంగ్రెస్ హామీలన్నీ ఫేక్ అని వ్యాఖ్య
- కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అధ్వాన్నంగా పాలన
- మోదీకి ఖర్గే, రేవంత్, సిద్ధరామయ్య కౌంటర్లు
- తెలంగాణను మీ పాలిత రాష్ట్రాలతో పోల్చి చూసుకోవాలన్న రేవంత్
- పాలనపరంగా తెలంగాణదే రికార్డు
- బీజేపీ పాలిత ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదని వ్యాఖ్య
- 11 నెలల్లోనే 50వేలకు పైగా ఉద్యోగాలిచ్చాం
- 25 రోజుల్లోనే 22 లక్షల మంది రైతులకు రూ. 18వేల కోట్ల రుణాలు మాఫీ
- ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందని స్పష్టీకరణ
- సీఎం ట్వీట్ పై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్
- ఆరు గ్యారంటీలకు ఎంత సమయం పడుతుందని ప్రశ్న
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాదేది వార్తకు అనర్హం అన్నట్టు నేతలు ప్రతి అంశాన్నీ తమ రాజకీయాలకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు లేకున్నా రాష్ట్ర రాజకీయాల్లో ఆ వేడిని పుట్టిస్తున్నారు. తాజాగా పొరుగు రాష్ట్రంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ తెలంగాణ పాలనను ప్రచారస్త్రంగా మలుచుకోవడం రాష్ట్రంలో రసవత్తర రాజకీయాలకు తెరలేపింది. ముందుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఇస్తున్న, ఇచ్చిన గ్యారంటీలన్నీ ఫేక్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల ఒకటిన ట్విట్టర్ లో పెట్టిన పోస్టు బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో పరస్పర విమర్శలు, విమర్శలకు దారి తీసింది. రేవంత్ సర్కార్ చెబుతున్నట్టు తెలంగాణలో అసలు రుణమాఫీ జరగనే లేదనీ, మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే అక్కడ ఇస్తున్న హామీలూ అమలు కావంటూ మోదీ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన అంకెల గారడీతో సాగుతోందని దుయ్యబట్టిన విషయం తెలిసిందే. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఏఐసీసీ నేతలు సైతం రంగంలోకి దిగారు. అసలు బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ప్రజల అదోగతి.
కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలు : మోదీ
అమలుకు సాధ్యం కానీ హామీలివ్వడం కాంగ్రెస్ అలవాటుగా మారింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి అధ్యాన్నంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు కావడం లేదు. అవి అమలు కావని వాళ్లకూ తెలుసు. అయినా ముందువెనక ఆలోచించకుండా హామీలిచ్చేస్తున్నారు. తెలంగాణలోనయితే రైతులు రుణమాఫీ కోసం ఇంకా ఉన్నారు.
రాష్ట్రంలో చీకటి, నిరాశకు పారదోలం : సీఎం రేవంత్
గత పదేళ్లలో నెలకొన్న చీకటి, నిరాశను తాము గత 11 నెలల్లో పారదోలామని, తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సూర్యుడిలా ఉదయిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్ వేదికగా పీఎంకు కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే దేశంలోనే అతి పెద్ద రుణమాఫీ అమలు చేశామన్న సీఎం రెడ్డి, 22 లక్షల మందికి పైగా రైతులకు రూ.2 లక్షల వరకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి, కేవలం 25 రోజుల్లోనే జమ చేసినట్లు రేవంత్ తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్న మహిళలు తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధిక గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతోంది, తెలంగాణలో రూ.500 సిలిండర్లు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారు. దశాబ్ద కాలం పాటు పరీక్షలు, ఉద్యోగాల నియామకాల్లో విఫలమైతే, కాంగ్రెస్ ప్రభుత్వం అధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు గ్రూప్స్ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించడం జరిగింది. 11 నెలలలోపే కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, బీజేపీ పాలిత ఏ రాష్ట్రంతో పోల్చినా ఇది రికార్డ్ అని స్పష్టం చేశారు. గతంలో విస్మరించిన మూసీ నదిని పరిశుభ్రం చేయడంతో పాటు పునరుద్దరణ చేస్తున్నామని, గత పదేళ్లుగా ధ్వంసం చేసిన, కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, నీటి వనరులను సంరక్షిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంమన్న సీఎం, అందుకోసం మాస్టర్ ప్లాన్ ఖరారవుతోందని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు తామిచ్చిన ప్రతి వాగ్ధానం వారికి పవిత్రతతో కూడిన నిబద్ధత అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మీకు 10 వేల రోజులిచ్చినా సరిపోవు : సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ కౌంటర్
అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి పది వేల రోజులు కూడా సరిపోవని కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. మాజీ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ కు రీ కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్.. రాష్ట్రంలోని తమ బీజేపీ ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మిస్తుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తుంది. శాంతి భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ విఫలమై ఉంది. ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని. మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయనీ,రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు.