- విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసుల చర్యలు
- శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు : మధుసూదనాచారి
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పోలీసు కేసు నమోదైంది. మహబూబ్‌నగర్‌లోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేపట్టారు.. తమ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వరద బాస్కర్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు తనపై దాడి చేశారంటూ వరద బాస్కర్ బయట ప్రచారం చేశారు. దీంతో గత నెల 30న వరద బాస్కర్ ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ గౌడ్ అక్కడి నుంచి నేరుగా తన అనుచరులతో పెద్ద ఎత్తున పోలీస్ ప్టేషన్ ఎదుట ధర్నా చేశారు.దీంతో పోలీసులు సాయం పాటించాలని, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు పోలీసులపై శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీలావుంటే మహబూబ్ నగర్ లో ఓ సర్వే నెంబర్ లో ఉన్న భూమికి నకిలీ పట్టాలు సృష్టించిన శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ను వారం రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా శ్రీనివాస్ గౌడ్ పైనా కేసు నమోదు కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.
శ్రీనివాస్ గౌడ్ ను టార్గెట్ చేశారు : మధుసూదనాచారి
రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని రాజకీయ కక్షలకు దిగుతోందని బీఆర్‌ఎస్ శాసనమండలి పక్ష నేత మధుసూదనాచారి. శుక్రవారంమహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి0 సంఘీభావం తెలిపారు. ఇప్పటికే దివ్యాంగుల ఇండ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు మాజీ మంత్రి తమ్ముడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా విభాగం నేత వరద భాస్కర్‌ను సీఐ స్టేషన్‌కు పిలిపించి ఆ కారణంగా కొట్టి బైండోవర్ చేయడం.. దీన్ని ప్రశ్నించినందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పోలీసు విధులకు ఆటంకం కలిగించేలా కేసులు పెట్టడం దారుణమన్నారు.