- తక్షణమే తగు ప్రతిపాదనలు సిద్దం చేయండి
- సంబంధిత అధికారులను నియమించిన మంత్రి తుమ్మల
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు ఒక మోడల్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. శుక్రవారం
కో..ఆపరేటీవ్ ,మార్కెటింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రాధమిక సహకార సంఘాలు (పిఇఎస్‌ఎస్) మార్కెటింగ్ యార్డులలో సంస్థాగతంగా చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించి….తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించి రైతులకు మరింత సులభతరంగా, తగిన సేవలు అందేలా రీఆర్గనైజేషన్ చేసి, అవసరమైన చోట కొత్త శాఖలు ఏర్పాటు చేయడం మరియు సంఘాల పరిపుష్టికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం.
డిసిసిబి, డిసిఎమ్‌ఎస్‌లలో గతంలో జరిగిన అవకతవకలు అన్నింటిమీద శాఖాపరమైన విచారణను త్వరితగతిన పూర్తి చేసి, చర్యలతో పాటు, సర్ చార్జీలు విడుదల చేసిన చోట నిధుల రికవరీ అవసరం. మార్కెట్ల ఆధీనంలో ఉన్న గోదాముల నిర్వహణ, ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే విధంగా చేసి మార్కెట్ల ఆదాయాన్ని పెంచింది. ఆ నిధులను రైతులకు మరింత మెరుగుదలలు అందించేవిధంగా సౌకర్యాల కల్పనకు వినియోగించాలని నిర్ణయించారు.
మార్కెట్ కు మరియు జిన్నింగ్ మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని, జిల్లా అధికారులు, సెక్రటరీలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. వాట్స్ యాప్ సేవ (8897281111) ద్వారా వెయిటింగ్ టైం, పేమెంట్ స్టేటస్, కంప్లయింట్ ఫోరం, ఇతర సేవలను వినియోగించుకునే రైతులను పరిశీలించండి.అకాల వర్షాలు వస్తున్నందున మార్కెటింగ్, వ్యవసాయ వ్యవసాయ అధికారులు, సిసిఐ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.రైతు అందించిన పంటలు తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోళ్ళ విషయములో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి పర్యవేక్షణ. ఈ సమావేశంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్, కొ-ఆపరేటివ్ శ్రీ ఉదయ్ కుమార్ , కోపరేటీవ్ అడిషనల్ డైరెక్టర్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు నిర్వహించారు.