- మాట ఇచ్చిన నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- నామినేటెడ్ పదవి రెసులో ఉంది.
- కాంగ్రెస్ ఆదేశిస్తే వాచ్ మెన్ పదవికి కూడా సిద్ధమే
- ఆర్స్‌ఫార్మ్ ఫస్ట్ ఫౌండేషన్, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్
సిద్దిపేట, ముద్రణ ప్రతినిధి :ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, కాంగ్రెస్ నేత, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ చక్రధర్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ అమలుతో జిల్లాను వేములవాడ కమాన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్లెక్సీ కి పాలాభిషేకం చేసి, స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫార్మర్స్ ఫస్ట్‌చక్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ధరర్ గౌడ్ మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రంలో పండగ వాతావరణం ఏర్పాటు చేశారు.
ప్రతిపక్షాలకు ఈ నిర్ణయం చెంప పెట్టు లాంటిదని అన్నారు.కాంగ్రెస్ చరిత్రలో గురువారం సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలనీ ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తున్నావ్ , హరీష్ రావు పార్లమెంట్ లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఆదేశిస్తే వాచ్ మెన్ పదవికైనా సిద్ధమే….
కాంగ్రెస్ ఆదేశిస్తే వాచ్ మెన్ పోస్ట్ చేయడానికైనా సిద్ధమే అని చక్రధర్ గౌడ్ అన్నారు. రుణ మాఫీ సంబరాల్లో పాల్గొన్న ఆయనను మీరు నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. నామినేటెడ్ పోస్టును నేను కూడా ఆశిస్తున్నాను. కాంగ్రెస్ ఆదేశిస్తే వాచ్ మెన్ పదవి కూడా తాను సిద్ధమే అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.