- రైతు రుణమాఫీ తో గ్రామ గ్రామాన పండుగ చేసుకుంటున్న రైతులు
- ఇచ్చిన గడువు ముందే రుణమాఫీ చేసి విపక్షాలకు దిమ్మతిరిగేలా చేసిన ముఖ్యమంత్రి
- రానున్న కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో మరింత అభివృద్ధిలోకి తెలంగాణ రాష్ట్రం
- సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్
తుంగతుర్తి ముద్ర:- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో రైతులకు అందించి దేశంలోనే లక్షలాది మంది రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. వెనకడుగు వేయలేదని అధికారంలోకి వచ్చిన కొద్దినే ముఖ్యమైన హామీలన్నీ అమలవుతున్నాయని అన్నారు.
గత పాలకులు రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసింది వాస్తవం కాదన్నారు. నేడు లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ అప్పటి గ్రామ గ్రామాన రైతులు పండుగ జరుపుకున్నారని అన్నారు. ఏ గ్రామంలో చూసిన రైతుల రుణమాఫీ గురించి చర్చించుకుంటున్నారని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రుణమాఫీ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత రాహుల్ ని ప్రశంసిస్తున్నారని అన్నారు .రైతులను ఆదుకునేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలంగాణలో రైతులకు ప్రస్తుతం జరుగుతున్న మేలు రుజువుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తుందని అన్నారు.
రుణమాఫీపై అవాకులు చవాకులు మాట్లాడిన ప్రతిపక్షాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి దిమ్మ దిరిగేలా జవాబు ఇచ్చారని అన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుందని డీఎస్సీ వాయిదా వేయాలని లేనిపోని కుంటి సాకులు చూపిస్తున్నారని అన్నారు. పథకాలను ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని చేకూర్చాలని వెంకన్న యాదవ్ అన్నారు.