- నల్లగొండ జిల్లా ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే మా లక్ష్యం
చండూరు, ముద్ర: అక్రమంగా గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు . శనివారం మునుగోడుమండల ఆసుపత్రిని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు నమోదు చేశారు. వారు కొరటికల్ గ్రామానికి చెందిన బొల్లం వెంకటేష్ , కనగల్ అయిన కురంపల్లి గ్రామానికి చెందిన దోటి రామరాజు హైదరాబాద్ లోని ధూల్ పేట్ చెందిన గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర (5) ప్యాకెట్లలో 200 గ్రాములు రూ. 2 వేల చొప్పున మొత్తం రూ.10 వేల గంజాయిని కొనుగోలు చేసి మండల కేంద్రంలోని లక్ష్మీదేవి గూడెంకు వెళ్లే రోడ్డు పక్క పశుల సంతలోని రేకుల షెడ్డులో మునుగోడు మండల కేంద్రానికి చెందిన అరునెల్లి వికాస్ వర్ధన్ అలియాస్ డాన్ , మునుగోడు కొండపల్లి గ్రామానికి చెందిన వీరమల్లేశ్వర లింగస్వామి, గుర్రంపోడు గ్రామం నుంచి బొల్లారం గ్రామానికి చెందిన గణనాథుడు. విక్రయించబడిన రాగా షెడ్డులో కూర్చోగా పక్క సమాచారం తెలుసుకున్న మునుగోడు ఎస్సై వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి పట్టుకోగా విచారణలో ఐదుగురు నిందితులను పట్టుకున్నారు .
వారి నుంచి అందాజ 1000 గ్రాములు గంజాయి, 4 సెల్ ఫోన్లు, గంజాయి రవాణా చేసేందుకు ఉపయోగించిన బైక్లను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్ నందు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి, మునుగోడు చుట్టు ప్రక్కల వారకి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇందులో బాగముగా 35 మంది భాదితులను గుర్తించి, వారిలో కొంత మందికి చేయగా గంజాయి సేవించినట్లుగా వచ్చినది మరియు అందరికి కౌన్సిలింగ్ అందించబడింది. పల్లెల్లో పట్టణాలలో డ్రగ్స్ కు బానిస పెడదారిలో కుటుంబాలను వీధిపాలు చేస్తున్న కుటుంబాలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్నారు .గంజాయి కేసును సేదించిన నల్గొండ డి.ఎస్.పి కె.శివరాం రెడ్డి , చండూర్ సి.ఇ. వెంకటయ్య ,మునుగోడు యస్.ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు తో సిబ్బంది రమేశ్, నర్సింహా, వెంకన్న, నాగేశ్వర రావు, ఆంజనేయులు, జానీ, మోహన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.