ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం బ్యాంకు మెయిన్ బ్రాంచిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచి చీఫ్ మేనేజర్ కేడీసింగ్ మాట్లాడుతూ 1908 సంవత్సరంలో బరోడాలో కేవలం 5 లక్షల రూపాయలతో ప్రారంభించిన బ్యాంకు 25 లక్షల కోట్ల టర్నోవర్‌తో కొనసాగుతుందని అన్నారు.
ఈ బ్యాంకును షాయాజీరావు గౌక్వాడ్-3 1908 జూలై 20న ప్రారంభించారని. ప్రస్తుతం దేశంలో వేల 9,600 పైచిలుకు శాఖలతోనే అతి పెద్ద రెండవ బ్యాంకుగా నిలిచిపోయింది. సుమారు 74,227 మంది సిబ్బంది సేవలందిస్తున్నారని తెలిపారు. కరీంనగర్ పట్టణంలో నాలుగు శాఖలు ఖాతదారులకు సేవలందిస్తున్నాయని తెలిపారు. కరీంనగర్ మెయిన్ బ్రాంచిలో 25 వేల మంది ఖాతాదారులకు ఉత్తమ సేవలందిస్తున్నామని తెలిపారు. అన్ని బ్యాంకులకన్నా డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నామని, గోల్డ్ లోన్, హౌజింగ్ లోన్ సౌకర్యాలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు ఉన్నారు.