- ప్రజా పాలనలో అవినీతికి అక్రమాలకు తావు లేదు
- విద్యాభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత
- ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన
- ప్రతి ఉద్యోగి తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి
- రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర,పానుగల్:- తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పారదర్శకంగా పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యం అని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పానగల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో 85 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి భవన నిర్మాణ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కలిసి భూమి పూజ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 57 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన సందర్భంగా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం రైతుల శ్రేయస్సు కోసం ఆగస్టు వరకు రుణమాఫీ జరుగుతుందని, ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని,పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం అధిక నిధులను కేటాయిస్తున్నారు.కొల్లాపూర్ నియోజకవర్గంలో కోటా కింద మంజూరైన పది కోట్ల రూపాయలలో రెండు కోట్ల రూపాయల నీటి సమస్య పరిష్కారానికి కేటాయించడం,మిగతా ఎనిమిది కోట్ల రూపాయల పాఠశాలల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి నిధులు అందజేస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రణాళిక బద్ధంగా విద్యను అభ్యసించాలని, ప్రతిరోజు విధిగా పత్రికలను చదవాలన్నారు.
పాఠశాల పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది. కళాశాల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ప్రతి విద్యార్థికి చదువుకోవాలనే పట్టుదల, సేవా భావం, ధైర్యం, క్రమశిక్షణ వుండేలా కృషి చేయాలని తమ సొంత బిడ్డలతోపాటు చూసుకోవాలన్నారు.పానుగల్ కస్తూరిబాకు పాఠశాలలకు ప్రాథమిక వసతుల కల్పన, విద్యాభివృద్ధి కోసం 35 లక్షల కోట్లను వెంటనే నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవింద రాజులు, తహసీల్దార్ సుభాష్ నాయుడు, ఎంపీడీఓ కోటేశ్వర్,ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, డీటీ అశోక్,ఏపీఓ కురుమయ్య, ఏఈ కవిరెడ్డి,మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్ ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాముయాదవ్,బ్రహ్మం,పుల్లారావు,జయరాములు సాగర్,వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీలు,మాజీ సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనసాగుతున్నారు.