Home తెలంగాణ బడ్జెట్టా.. అప్పుల పత్రమా? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

బడ్జెట్టా.. అప్పుల పత్రమా? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
బడ్జెట్టా.. అప్పుల పత్రమా? - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • కాంగ్రెస్ రాష్ట్ర బడ్జెట్ గాడిద గుడ్డేనా?
  • ఆరు హామీలకు కేటాయింపులెక్కడ?
  • మూసీ రివర్ ఫ్రంట్‌కు పైసా ఇవ్వలేదు
  • కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌ను గాడిద గుడ్డుతో అభివర్ణించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కూడా గాడిద గుడ్డేనా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. గాడిద గుడ్డు పెట్టకపోవడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోవడం కూడా అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమన్నారు. అసలు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్ ప్రసంగమా? లేక అప్పుల పత్రమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి సంజయ్ గురువారం స్పందించారు. అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అని నిలదీశారు. అప్పులున్న విషయం ముందు తెలిసీ 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు.

కేంద్రాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారా..?

ఆరు గ్యారంటీలు సహా ఇచ్చిన హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండాలంటే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా? అని బండి ఉంది. బడ్జెట్ కేటాయింపులకు సరిపడా ఆదాయం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో లెక్కలు చూపకపోవడం విడ్డూరమని. సర్కారీ భూములన్నీ అడ్డానికి పావుశేరు లెక్కన అమ్మ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్‌కు మాటలెక్కువని బడ్జెట్ చూస్తే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చి, 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్‌కు బడ్జెట్‌లో పైసా కేటాయించారని మీరు కేంద్రంపై విమర్శలు ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా? అని నిలదీశారు.. రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే ప్రభుత్వమే ఒప్పుకొన్నదని అన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా తొలగిస్తారా? లేదా? చెప్పాలన్నారు. నష్టపోయిన ‘రైతు భరోసా’, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఏడాది పాటు చెల్లిస్తారా? అని చెప్పాలన్నారు.

రాజీనామా చేస్తారా?

బడ్జెట్ చివరి పేజీలో పేర్కొన్న మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులకు, కాంగ్రెస్‌ ఇచ్చిన అలవికాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించాలని హితవు పలికారు. కాంగ్రెస్ హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్‌లోనే తేలిపోయింది. బడ్జెట్ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు అని, సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా? అని నిలదీశారు. తెలంగాణలో సమసమాజం స్థాపిస్తామనడం ఈ శతాబ్దం జోక్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

ఇన్కమ్ కోసం ప్రభుత్వ భూములమ్ముతారా

కాంగ్రెస్ హామీలు ఐదేళ్లలో అమలు చేయడం అసాధ్యం అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు, గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని. ఆదాయం ఎలా సమకూర్చుకుంటారో ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించలేదని, ఇన్‌కమ్ కోసం ప్రభుత్వ భూములన్నీ అమ్మాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. హామీల అమలు కాంగ్రెస్‌కు చేతకాదని బడ్జెట్ చూస్తే తెలుస్తోందని బండి సంజయ్ దుయ్యబట్టారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech