- ఆరోగ్య మిత్ర ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: 17 ఏళ్ల నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లాలో నీ ఆరోగ్య మిత్ర ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. డిపిఓ (డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్) క్యాడర్ కల్పిస్తూ జీతాలు పెంచాలని డిమాండ్‌లో ఉంది. ప్రతిష్టాత్మక రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి మూల స్తంభాలైన ఆరోగ్య మిత్ర ఉద్యోగుల జీతాలు వారి ఉద్యోగ భద్రత, డిపిఓ కేడర్ వారు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించిన స్పందన కరువైందని వాపోయారు. ఆరోగ్యం మిత్రుల కుటుంబాలు వీధిన పడకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై నిర్వహించిన వారు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమస్యలను పరిష్కరించకపోతే ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
అధ్యక్షులు : వి కురుమయ్య గౌరవ అధ్యక్షులు : బంగారయ్య
జనరల్ సెక్రటరీ : కె.మహేష్
యూనియన్ సభ్యులు
కె.సుజాత, సి.పారిజాత, కె.పరుశురాములు కొనసాగుతున్నాయి.