- శిధిలావస్థకు చేరుకున్న ప్రధాన జాబితా
- ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదని అంటున్న ప్రజలు
- పాలకులు మారిన నియోజకవర్గ తలరాత మాత్రం మారడం లేదు అంటున్న ప్రజలు
- తక్షణమే రవాణా వ్యవస్థను అధికారులను కోరుతున్న ప్రజానీకం
తుంగతుర్తి ముద్ర:- తుంగతుర్తి నియోజకవర్గం అనాదిగా రవాణా రంగంలో పూర్తి స్థాయిలో వెనుకబడి ఉంది. నియోజకవర్గం ఏర్పాటు నుండి ఎందరో నేతలు మారిన నియోజకవర్గం తలరాత మారడం లేదని ఈ ప్రాంత ప్రజానీకం చెబుతోంది. నియోజకవర్గ కేంద్రం నుంచి ఏ వైపుకు వెళ్లాల్సి వచ్చిన రోడ్లు పూర్తిగా పాడై రవాణాకు అనుకూలంగా లేవని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా తుంగతుర్తి నుండి వెంపటి వయ రావులపల్లి మీదుగా పక్కనే ఉన్న తొర్రూరు గాని, కొడకండ్ల గాని వెళ్లాలంటే కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితిలో రోడ్డు ఉందని ప్రజలు అంటున్నారు. గత పాలకుల నిర్వాకం మూలంగానే రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో పాడై ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఈ రోడ్డు కూడా వందలాది వాహనాలు అనునిత్యం ప్రయాణించాయి. మారుమూల తండాల్లో గిరిజన ఆవాసాల్లో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నియోజకవర్గ కేంద్ర ఆసుపత్రికి రావాలంటే ఆరోగి నరకయాతన అనుభవించాల్సిందే. గర్భిణీ స్త్రీల పరిస్థితి చెప్పనవసరం లేదు అలాగే కుంటపల్లి మామిడాల రోడ్డు ,తుంగతుర్తి బండ రామరం మీదుగా గుండెపురి నుండి తిరుమలగిరి వెళ్లే రోడ్డు అదే విధంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం నుండి నేషనల్ హైవే వెలుగుపల్లి రోడ్డు, తుంగతుర్తి అన్నారం రోడ్డు, తుంగతుర్తి కొత్తగూడెం మీదుగా నూతన గోరింటకల్ వెళ్లే రోడ్డు, కర్విరాల స్టేజి నుండి గుమ్మడవెల్లి, తూర్పు గూడెం నుండి వెళ్లే రోడ్డు, ఇలా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ అస్తవ్యస్తంగా జీర్ణావస్థలో ఉండి కనీసం పాదచారులు వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు.
ఏదైనా రోడ్డు గుండా కావాలంటే ఎదురుగా వ్యవసాయ పశువులు గాని గొర్రెల మందలు గాని లేదా భారీ వాహనాలు గాని ఎదురైతే నాన తిప్పలు పడుతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గడచిన పది సంవత్సరాల కాలంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రభుత్వం మారి పాలకులు మారిన నేటి వరకు ఆయా రోడ్లకు శంకుస్థాపన జరిగింది తప్ప పనులు ప్రారంభం కాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అసలే వర్షాకాలం చినుకు పడితే చిత్తడి అయ్యి రోడ్లు వివిధ పనుల నిమిత్తం నియోజకవర్గ కేంద్రానికి వచ్చే ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఏకంగా కంపచెట్లు రోడ్ల మీదికి వచ్చి ఎదురుగా వచ్చే వాహనం తప్పుకోడానికి కూడా వీలు లేకుండా పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా పాలకులు అధికారులు పట్టించుకోని తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రయాణికులను ఆదుకోవాలని కోరుతున్నారు.