- తప్పకుండా ప్రక్షాళన
- 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఎస్డీపీల ట్రాన్స్ఫర్
- ముగ్గురు ఐఎఫ్ఎస్ల బదిలీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్రంలో ఒకేరోజు కీలక బదిలీలు జరిగాయి. 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఒకేసారి 70 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. డిప్యూటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, న’ల్లగొండ కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువ’నగిరి కలెక్టర్‌గా హనుమంతరావు, పురపాలక శాఖ సంచాలకులుగా టీకే శ్రీదేవి, సీసీఎల్ శాఖఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా మందా మ‐కర‡్గారందు లుగా హనుమంతకు అదనపు బాధ్యతలు, ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్‌గా ఎస్ హరీశ్, విపత్తు నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శి హరీశ్‌కు అదనపు బాధ్యతలు, ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్ చక్రర్పతికి ఆర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఎస్ దిలీప్ కుమార్‌ను బదిలీ చేశారు. ఇక, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ కూడా జరిగింది. వికారాబాద్ జిల్లా పారెస్ట్ ఆఫీసర్‌గా రాజన్నను నియమించారు. ఎస్సీ డెవలప్మెంట్ ఎండీగా క్షితిజ, జీహెచ్ఎంసీ సర్కిల్ ఎంఏయూడీ అడిషనల్ కమిషనర్‌గా సుభద్రాదేవిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పూర్తిగా ప్రక్షాళన
రాష్ట్రంలో శాఖా ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏకంగా 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. ఇటీవల ఇటీవల సంఘాలు పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే బదిలీల ప్రక్రియ. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, సివిల్ సప్లయిస్ శాఖల్లో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా స్థాన చలనం చేశారు. కొందరికేమో వారు కోరుకున్న సీట్లు రాలేదు. మరికొందరికి వారు ఆశించని విధంగా ప్రాధాన్యత కలిగిన డివిజన్లకు బదిలీ కావడం. వెయిటింగ్ లోని పది మంది ఆర్డీవోలకు కూడా పోస్టింగ్స్ లభించాయి. డిప్యూటీ కలెక్టర్లు ఎల్.రమేష్, ఎన్. ఆనంద్ కుమార్, హన్మనాయక్ లకు ఏలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని శాఖలో రిపోర్టు చేయవలసి ఉంది. ఈ మేరకు సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
త్వరలోనే కొత్త చట్టం
దీపావళికి కొత్త ప్రాజెక్ట్ చట్టం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గ్రామ స్థాయిలో వ్యవస్థను పునరుద్ధరించాల ని తీసుకున్నారు. ఈ ప్రక్రియకు ముందే అధికారుల బదిలీలు చేపలేశారు.