Home సినిమా ఆ షాట్స్‌ని డైరెక్ట్‌గా కాపీ కొడతాను.. నేను చేసిన వాటిలో పరమ చెత్త ప్రాజెక్ట్‌ అదే! – Sneha News

ఆ షాట్స్‌ని డైరెక్ట్‌గా కాపీ కొడతాను.. నేను చేసిన వాటిలో పరమ చెత్త ప్రాజెక్ట్‌ అదే! – Sneha News

by Sneha News
0 comments
ఆ షాట్స్‌ని డైరెక్ట్‌గా కాపీ కొడతాను.. నేను చేసిన వాటిలో పరమ చెత్త ప్రాజెక్ట్‌ అదే!


ప్రస్తుతం టాలీవుడ్‌లోనే డైరెక్టర్ కాదు, ఇండియాలోనే టాప్‌గా పేరు తెచ్చుకుంటున్న రాజమౌళి సినీ ప్రస్థానం ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. 23 సంవత్సరాలలో 12 సినిమాలు డైరెక్ట్ చేసి అపజయం అనేది ఎరుగని డైరెక్టర్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడుగా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తూ అద్భుత విజయాలు అందుకుంటున్న రాజమౌళి.. తను చేసే సినిమాల్లో కొన్ని షాట్లను కాపీ చేస్తానని మీడియా, సోషల్ మీడియా గగ్గోలు పెడుతూ ఉంటుంది. అతను కాపీ చేసిన సీన్ కావచ్చు, షాట్ కావచ్చు ఎక్కడి నుంచి కాపీ చేసాడు అనేది ఫ్రూవ్స్‌తో సహా మీడియాలో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ విషయంలో రామ్‌గోపాల్‌వర్మ తాను హాలీవుడ్‌ సినిమాల నుంచి ఇన్‌స్పైర్‌నని, కొన్ని సీన్స్‌ కాపీ కూడా చేశానని బహిరంగంగానే ఒప్పుకున్నారు.

ఇక రాజమౌళి విషయానికి వస్తే.. తన సినిమాల్లోని కొన్ని షాట్స్‌ హాలీవుడ్‌ సినిమాల నుంచి, ఇతర భాషా చిత్రాల నుంచి కాపీ చేసిన మాట వాస్తవమని ఒప్పుకుంటారు. ఈ సిసిడెంట్ దాదాపు 10 సంవత్సరాల క్రితమే ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. దానికి కారణం ఏమిటి అనేది వివరిస్తూ.. ‘చిన్నతనం నుంచీ మనపై హాలీవుడ్‌ సినిమాల ప్రభావం ఉంటుంది. నా వరకు నేను మన సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు ఉండవు అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇక ఆ సినిమాల నుంచి కాపీ కొడతావు అనే మాటకు నా సమాధానం.. అవును.. హాలీవుడ్‌ సినిమాల్లోని షాట్స్‌ని డైరెక్ట్‌గా కాపీ కొడతాను. మన సినిమాల విషయానికి వస్తే.. మనం దేవుడిలా కొలిచే కె.వి.రెడ్డిగారు కూడా కాపీ చేశారు. ఒక క్లాసిక్‌గా చెప్పుకునే ‘పాతాళభైరవి’ సినిమా ‘అలాద్దీన్’ నుంచి కాపీ చేసిందే. అలాగే ‘సఖి’ చిత్రంలో ఒక యాక్సిడెంట్‌ సీన్‌ తర్వాత హీరో, హీరోయిన్‌ ఒకరినొకరు చూసుకుంటూ వెళ్ళే సీన్‌ యాజిటీజ్‌గా ఒక హాలీవుడ్‌ సినిమాలోనిది. అంతేకాదు, ఎస్‌. రాజేశ్వరరావు వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌ ఇంగ్లీషు పాటల ట్యూన్స్‌ను కాపీ చేశారు. ఆయనే కాదు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్‌లు కాపీ చేస్తారు. ఇలా చేయడం ఆ సినిమాలకు, పాటలకు ఇన్‌స్పైర్‌ అయ్యాం అని చెప్పొచ్చు, డెవలప్డ్ వెర్షన్‌ అని చెప్పొచ్చు. కానీ, అది మేం తప్పుగా అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక షాట్ మనకు బాగా నచ్చింది.. దాన్ని మనం కూడా బాగా తియ్యాలని ట్రై చేయడం ఆ డైరెక్టర్‌కి ఇచ్చే ట్రిబ్యూట్‌గా నేను భావిస్తున్నాను. నా విషయానికి వస్తే.. హాలీవుడ్‌ సినిమాలోని ఒక షాట్‌ని కాపీ చేస్తే.. ఒక్కోసారి దాని కంటే బెటర్‌గా రావచ్చు. మరోసారి ఒరిజినల్ కంటే చెత్తగా రావచ్చు. నేను కాపీ చేసిన కొన్ని షాట్స్‌ ఒరిజినల్‌ కంటే చెత్తగా తీసినవి ఉన్నాయి. అలాగే ఒరిజినల్‌ కంటే ఇంకా బెటర్‌గా చేసినవి ఉన్నాయి. దీని వల్ల ఆయా సినిమాలకు సంబంధించిన రైటర్స్‌కిగానీ, డైరెక్టర్స్‌కిగానీ వచ్చే నష్టం ఏమీ ఉండదు. మనం కాపీ చేసిన విషయం కూడా వాళ్ళకి తెలీదు. అదే నేను ఓ తమిళ్‌ సినిమా నుంచో, మలయాళ సినిమా నుంచో కాపీ చేస్తే అది ఆ రైటర్‌కి, డైరెక్టర్‌కి ఎఫెక్ట్‌ అవుతుంది. కాబట్టి హాలీవుడ్ సినిమా నుండి ప్రేరణ పొందడం తప్పు అని నేను భావించడం లేదు.

నాకు సినిమాల మీద ఇంత గ్రిప్ రావడానికి కారణం.. నేను డైరెక్టర్ అవ్వకముందు అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో వర్క్ చేశాను. కొన్నాళ్ళు ఎడిటింగ్‌లో, కొన్నాళ్ళు రీరికార్డింగ్‌లో.. ఇలా అన్ని క్రాప్ట్స్‌ని టచ్ చేశాను. అలా నాకు సినిమా మీద కొంత అవగాహన కలిగింది. ఆ టైంలోనే ‘శాంతినివాసం’ సీరియల్ చేసే అవకాశం వచ్చింది. రాఘవేంద్రరావుగారి దర్శకత్వ పర్యవేక్షణలో సీరియల్ చేశాను. ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్స్‌లో పరమచెత్త ప్రాజెక్ట్ అదే. ఆ సీరియల్ అస్సలు బాగోదు. మరి దానికి అంత రేటింగ్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఈటీవీలాంటి స్టాండర్డ్స్‌లో ఉన్న సంస్థ, రాఘవేంద్రరావుగారు అసోసియేట్‌ అవ్వడం, సీరియల్‌ రిచ్‌గా ఉండటం, ప్రైమ్‌ టైమ్‌లో ఆ సీరియల్ ప్రసారం కావడం.. వీటివల్లే రేటింగ్‌ బాగా వచ్చిందనుకుంటున్నాను. కానీ, ఆ టైంలో వచ్చిన పిన్ని, కస్తూరి వంటి సీరియల్స్‌తో ప్రస్తుతం ‘శాంతి నివాసం’ చాలా బ్యాడ్‌ సీరియల్‌. ఆ సీరియల్స్‌లో కంటెంట్‌గానీ, డైలాగ్స్‌గానీ అద్భుతంగా ఉంటాయి. కానీ, ‘శాంతినివాసం’ రైటింగ్‌ సైడ్‌, టేకింగ్‌ సైడ్‌, డైరెక్షన్‌ సైడ్‌ ఏది బాగోదు. ఆ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు తెలీలేదుగానీ, తర్వాత అర్థమైంది’ అంటూ ఎస్‌.ఎస్‌.రాజమౌళి వివరించారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech