26
ముద్ర,తెలంగాణ:- ఎన్నికల్లో హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల హామీలో ముఖ్యమైన రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ అమలవుతోంది. ఇటీవల మొదటి విడత కింద రూ.1 లక్ష లోపు ఉన్నవారికి రుణమాఫీ చేసింది.
తాజాగా రెండో దశ రుణమాఫీ కోసం సిద్ధమైంది. ఈ రెండోరోజు విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్షన్నర రూపాయల రుణమాఫీ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండో విడతలో సుమారు 7వేల కోట్ల రుణమాఫీ చేయనుంది.