Home తెలంగాణ అంతర్గత రోడ్లన్నీ అస్తవ్యస్తం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

అంతర్గత రోడ్లన్నీ అస్తవ్యస్తం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
అంతర్గత రోడ్లన్నీ అస్తవ్యస్తం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • నాలుగేళ్లుగా పూడిక తీయని ప్రధాన డ్రైనేజ్

ముద్ర ప్రతినిధి, కోదాడ :- కోదాడ పట్టణంలో అంతర్గత రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి . ముఖ్యంగా అనంతగిరికి వెళ్లే రోడ్డు ఐటిఐ కాలేజీ వరకు , నయానగర్ ప్రధాన వీధి ఖమ్మం ఎక్స్ రోడ్డు వరకు , కట్టకమ్మగూడెం రోడ్డు హుజూర్ నగర్ రోడ్డు నుండి బైపాస్ జంక్షన్ వరకు , గుడిబండ వెళ్లే రోడ్డు ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి బైపాస్ ఫ్లై ఓవర్ వరకు , శ్రీమన్నారాయణ కాలనీ ప్రధాన వీధి ఎల్ఐసి ఆఫీస్ నుండి కట్టకమ్మగూడెం రోడ్డు వరకు , విజయవాడ రోడ్డు నుండి అల్వాల పురం గ్రామం మరియు భవాని నగర్ లోని వీధుల, గోపిరెడ్డి నగర్ , శ్రీమన్నారాయణ కాలనీ , రెడ్ చిల్లీ వెనుక , కెఎల్ఆర్ కాలనీ , టీచర్స్ కాలనీ , ఆజాద్ నగర్ , అంబేడ్ కాలనీలలో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి . వర్షం వస్తే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది .

కొన్ని రోడ్లు వేసి ఏళ్ళు గడుపుతుండగా , కొన్ని రోడ్లు మిషన్లను భగీరథ సమయంలో తవ్వి వదిలేయడం , గ్యాస్ పైప్ లైన్ వేసేందుకు , నెట్వర్క్ కేబుల్స్ వేసేందుకు ఇలా రకరకాల కారణాలతో రోడ్లను తవ్వి వదిలేయడంతో మున్సిపల్ పరిధిలో అంతర్గతంగా పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాకాలం కావడంతో పెద్ద పెద్ద గోతులలో వర్షపు నీరు చేరి వాహనదారులకు గుంత అవ్వక ప్రమాదాల బారిన పడుతున్నారు . ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు , ఆర్ అండ్ బి అధికారులు చొరవ తీసుకోని గుంతలు పూడ్చాలని పట్టణ వాసులు కోరుతున్నారు .

పూడిక తియ్యక – వ్యర్ధాలు కదలక

పట్టణంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న మెయిన్ డ్రయినేజి కాలువ పూడిక తియ్యక సుమారు నాలుగు సంవత్సరాలు అవుత వర్షం వస్తే మెయిన్ రోడ్డు మొత్తం అధ్వానంగా తయారవుతుంది . డ్రయినేజి పొంగి మురుగు నీరు మొత్తం రోడ్డు పైకి చేరి దుర్వాసన వస్తుంది . పట్టణంలో దోమల వ్యాప్తికి ప్రధాన కారణం ఇదే అని కొందరు అభిప్రాయపడుతున్నారు . ఈ ప్రధాన కాలువ నాలుగేళ్లుగా పూడిక తియ్యక పోవడంతో అది నిండిన వ్యర్ధాలు కదల మెయిన్ రోడ్డులో ఉన్న దుకాణదారులు దుర్వాసన తో పాటు ఈగలు , దోమలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు . ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech