ముద్ర,తెలంగాణ:-ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం.. రూ. 6190.01 కోట్ల నిధులు విడుదల చేశారు.
రెండో విడత రుణమాఫీలో భాగంగా అసెంబ్లీలో సీఎం కోసం. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణ రైతుల ఇళ్లల్లో పండుగరోజని, మా జన్మ ధన్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియా గాంధీలు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనం కాదు..రైతుల ప్రయోజనమే ముఖ్యమన్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు పాల్గొనడం ఆనందంగా జరిగింది. పంటబీమ తీసుకొచ్చింది కాంగ్రెస్..ఆహారభద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ అని.
రాష్ట్రవ్యాప్తంగా 6,40,223 మందికి రూ.6190.01 కోట్లు నిధులు విడుదల చేశారు. మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98కోట్లు విడుదల చేయనున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా 17మంది రైతులకు చెక్కులు అందజేయనున్నారు. అంతకుముందు మొదటి విడత కింద 11,34,412 మంది రైతులకు రూ.6034.96 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
జిల్లాల వారీగా చూస్తే..
- వికారాబాద్ – 23, 912 మంది రైతులు – రూ.240.07 కోట్లు,
- మహబూబ్ నగర్ – 22,253 – రూ.219.18 కోట్లు,
- నిజామాబాద్ – 23,769 – రూ.219.53 కోట్లు,
- కరీంనగర్ – 21,785 – రూ.207.82 కోట్లు,
- కామారెడ్డి – 24,816 – రూ.211.72 కోట్లు,
- నిర్మల్ – 18,728 – రూ.196.86 కోట్లు,
- యాదాద్రి భువనగిరి – 18,127 – రూ.177.48 కోట్లు,
- జగిత్యాల – 17,903 – రూ. 169.11 కోట్లు,
- నల్గొండ – 51,515 – రూ.514.26 కోట్లు,
- నాగర్ కర్నూల్ – 32,406 – రూ.312.43 కోట్లు,
- సంగారెడ్డి – 27,249 – రూ.286.76 కోట్లు,
- సిద్దిపేట – 27,875 – రూ.277.21 కోట్లు,
- సూర్యాపేట – 26,437 – రూ.250.96 కోట్లు,
- ఖమ్మం – 33, 942 – రూ. 262.51 కోట్లు,
- రంగారెడ్డి – 24,007 – రూ. 229.72 కోట్లు,
- మెదక్ – 22,850 – రూ.229.72 కోట్లు,
- వనపర్తి – 15,085 – రూ.140.86 కోట్లు,
- పెద్దపల్లి – 13,401 – రూ. 124.41 కోట్లు,
- కొమురం భీమ్ – 14,410 – రూ. 151.06 కోట్లు,
- రాజన్న సిరిసిల్ల – 12,202 – రూ.117.77 కోట్లు,
- వరంగల్ అర్బన్ – 11,818 – రూ.108.24 కోట్లు,
- జయశంకర్ భూపాలపల్లి – 8,851 – రూ. 92.50 కోట్లు,
- ములుగు – 6,215 – రూ.65.25 కోట్లు,
- మేడ్చల్ మల్కాజిగిరి – 789 – 6.15 కోట్లు,
- హైదరాబాద్ – 4 – 0.05 కోట్లు,
- వరంగల్ రూరల్ – 21,166 – రూ.190.58 కోట్లు,
- మహబూబాబాద్ – 17,880 – రూ.186.42 కోట్లు,
- ఆదిలాబాద్ – 18,390 – రూ.209.25 కోట్లు,
- జోగుళాంబ గద్వాల – 15,401 – రూ.166.21 కోట్లు,
- జనగామ – 15,401 – రూ.159.80 కోట్లు,
- మంచిర్యాల – 14,396 – రూ.138.88 కోట్లు,
- భద్రాద్రి కొత్తగూడెం – 17,308 – రూ.147.34 కోట్లు విడుదల చేశారు.